ETV Bharat / entertainment

ఫిలింనగర్​ క్లబ్ అధ్యక్షులుగా​ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నిక

హైదరాబాద్​ ఫిలింనగర్​ క్లబ్​ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్​ విజయం సాధించింది. దీంతో ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి గెలిచిన వారి పేర్లను ప్రకటించారు.

ghattamaneni adiseshagiri rao
ghattamaneni adiseshagiri rao
author img

By

Published : Sep 26, 2022, 9:14 AM IST

ఫిలింనగర్ క్లబ్ అధ్యక్షుడిగా సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్‌ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నికయ్యారు. 324 ఓట్ల ఆధిక్యంతో ఆదిశేషగిరిరావు ప్యానెల్‌ ఘన విజయం సాధించడంపై కృష్ణ, మహేశ్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.

అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కార్యదర్శిగా ముళ్ళపూడి మోహన్, కోశాధికారిగా రాజశేఖర్ రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా ఏడిద రాజా, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, సీహెచ్‌ వరప్రసాదరావు, శైలజ జూజాల, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్‌రావు, బాలరాజు, గోపాలరావు తదితరులు ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రానికి పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు తర్వాత విజేతల పేర్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చౌదరి అధికారికంగా ప్రకటించారు.

ఇవీ చదవండి: కెరీర్​లో అలా చేయడం ఇదే ఫస్ట్​ టైమ్​.. సూపర్​ స్ట్రాంగ్​గా నయన్!​: చిరంజీవి

రూ.100కే 'బ్రహ్మాస్త్ర' టికెట్.. ఆ నాలుగు రోజులు మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.