ETV Bharat / entertainment

సౌమ్య-వర్ష-భాను 'పరేషాన్' డ్యాన్స్​.. చూస్తే గుండెజారి గల్లంతవ్వాల్సిందే! - గుండెజారి గల్లంతయ్యిందే ఈటీవీ స్పెషల్ షో

ఈ హోలీ పండగకు బుల్లితెర ప్రేక్షకులకు మరింత ఎంటర్​టైన్మెంట్​ ఇచ్చేందుకు 'ఈటీవీ' ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది. ఇందులో సౌమ్య, భాను, వర్ష కలిసి చేసిన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

Holi event Anchor Sowmya Varsha Bhanu romantic dance
యాంకర్​ సౌమ్య, భాను, వర్ష 'పరేషాన్' డ్యాన్స్
author img

By

Published : Feb 27, 2023, 6:49 PM IST

Updated : Feb 27, 2023, 7:39 PM IST

ఈ హోలీ పండగకు స్మాల్​ స్క్రీన్ ఆడియెన్స్​కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు 'ఈటీవీ' సిద్ధమైంది. దీని కోసం 'గుండెజారి గల్లంతయ్యిందే' పేరిట ఓ స్పెషల్​ ప్రోగ్రామ్​ను తీర్చిదిద్దింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్​ చేసింది. అది ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో ఆద్యంతం కంటెస్టెంట్​ల అదిరిపోయే డ్యాన్స్​లతో, హైపర్​ ఆది పంచ్​లు, వర్ష, యాంకర్లు సౌమ్య , రవి చేసిన కామెడీతో అలరిస్తోంది. ఇక ఈ షోలో నిరుపమ్ పరిటాల, అర్జున్​లు అయితే తమ మాస్ డ్యాన్స్​ స్టెప్పులతో స్జేజ్​ను హోరెత్తించారు. లంగీలు కట్టి స్టెప్పులేస్తూ రెచ్చిపోయారు. ఆడియెన్స్ చేల ఈలలు వేయించారు. అలాగే మానస్ కూడా​.. 'ఎన్నో రాత్రులొస్తాయి' రొమాంటిక్​ సాంగ్​కు అదిరిపోయేలా డ్యాన్స్​ వేసి తనలోని రొమాంటిక్ యాంగిల్​తో ప్రేక్షకులను ఫిదా చేశాడు.

ఇకపోతే యాంకర్​ సౌమ్య, భాను, వర్ష కలిసి వేసిన రామ్​చరణ్​ 'ధృవ' సినిమాలో 'పరేషానురా'​ సాంగ్​​ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్ షో మొత్తానికే హైలైట్‌గా నిలిచేలా ఉంది. ఇది చూస్తే నిజంగానే ఆడియెన్స్​కు పరేషాన్​ అయ్యేలా ఉంది. హైపర్ ఆది, యాంకర్ రవి కూడా కలిసి చిందులేస్తూ ఆకట్టుకున్నారు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ సౌమ్యను స్టేజ్​పైనే స్కూటీపై ఎక్కించుకుని రౌండ్​లు వేశాడు హైపర్​ ఆది. ఆ సయయంలో వీరద్దరి మధ్య జరిగిన కామెడీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ షోలో శ్రేదీవి విజయ్ కుమార్ జడ్జిగా వ్యవహరించారు. ఆమె వీరందరి పెర్ఫార్మెన్స్​కు ఫిదా అయిపోయారు. వారందరిపై ప్రశంసలతో ముంచెత్తారు. అచ్చం సినిమా తరహాలోనే అదరగొడుతున్నారని కితాబిచ్చారు. సీనియర్ యాక్టర్​ అన్నపూర్ణ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఆమె చేసిన కామెడీ కూడా కితకితలు పెట్టించాయి.

ఇక ఈ షోలో పాల్గొన్న మరో వ్యక్తి సింగర్ రమణ. పల్సర్ బైక్ సాంగ్​తో బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయాడు. దీంతో పలు షోలలో పాల్గొంటూ తన పాటలతో ఆడియెన్స్​ను అలరిస్తున్నాడు. గతంలో జబర్దస్త్ భానుపై ఓ పాటను పాడి తన ప్రేమను తెలియజేసిన అతడు తాజాగా మరోసారి తాజా షోలో తన ప్రేమను పాట రూపంలో తెలిపాడు. అలా రమణ-భానులు కలిసి ఓ సాంగ్​లో సందడి చేశారు. మొత్తంగా ఈ షో ఓ హోలీ పండగ వాతావరణాన్ని క్రియేట్​ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​.. మార్చి 5న రాత్రి 7 గం.లకు ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సుధీర్​ బాబు కొత్త లుక్​.. సిక్స్​ ప్యాక్​ నుంచి లడ్డు బాబులా..

Last Updated : Feb 27, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.