Dill Raju On Chiranjeevi Comments: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, నిర్మాత దిల్‌రాజు తనపై తప్పుడు వార్తలు రాస్తున్న పలు వెబ్సైట్లకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. "ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. చిన్న సినిమాలను ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. ఏదో ఒక రకంగా నాపై ప్రతీ సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తాను. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున (నా సామిరంగ) , వెంకటేశ్ (సైంధవ్) సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తాను" అంటూ విమర్శకులకు దిల్‌రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అయితే ఎప్పుడూ లేనట్టు ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ పోటీపై రీసెంట్గా దిల్‌రాజు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఐదు సినిమాలు సంక్రాంతికి రిలీజైతే అందరికీ న్యాయం జరగదని దిల్‌రాజు ఈ ప్రెస్మీట్లో అన్నారు. ఎవరైన ఈ పోటీ నుంచి తప్పుకుంటే, ఫిల్మ్ ఛాంబర్ నుంచి వారికి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఆయన అన్నారు. దీంతో రవితేజ 'ఈగల్' సంక్రాంతి బరిలోనుంచి తప్పుకుంది. ఇక జనవరి 12న 'గుంటూరు కారం' (మహేశ్‌బాబు), 'హనుమాన్' (తేజ సజ్జ) ఓకే రోజు రానుండగా, జనవరి 13న 'సైంధవ్' (వెంకటేశ్), జనవరి 14న 'నా సామిరంగ' (నాగార్జున) రిలీజ్ కానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అందరికీ న్యాయం జరగడం కష్టం- ఎవరైనా తప్పుకుంటే బాగుంటుంది- సంక్రాంతి పోటీపై దిల్‌రాజు కామెంట్స్!
చిరంజీవి కాంట్రవర్సీ కామెంట్స్‌పై దిల్ రాజు రియాక్షన్.. ఏమన్నారంటే?