ETV Bharat / entertainment

Dhee 14: ఫైనల్‌లో కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్.. హైపర్​ ఆదిని ఆటాడేసుకున్న రవితేజ - Dhee 14 finale raviteja promo

ఉర్రూతలూగించే స్టెప్పులతో ప్రముఖ డ్యాన్స్‌ షో 'ఢీ 14' ప్రతివారం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ డ్యాన్స్‌ షో ఫైనల్‌ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 4న ఆదివారం ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల అయింది. ఫైనల్‌కు అతిథిగా రవితేజ వచ్చారు. ఈ క్రమంలోనే హైపర్‌ ఆదిపై పంచ్​లు వేస్తూ నవ్వులు పూయించారు. ఇక రవితేజ తన కామెడీతో పాటు డ్యాన్స్‌తోనూ అదరగొట్టారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..

Dhee 14  finale raviteja as chief guest and counter on Hyper adi
Dhee 14: ఫైనల్‌లో కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్.. హైపర్​ ఆదిని ఆటాడేసుకున్న రవితేజ
author img

By

Published : Dec 1, 2022, 9:56 AM IST

Updated : Dec 1, 2022, 10:16 AM IST

తెలుగు బుల్లితెరపై కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్, అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగిస్తున్న షో 'ఢీ 14'. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు తమ టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. జబర్ధస్త్ హైపర్ ఆది, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ డ్యాన్స్‌ షో ఫైనల్‌ ఎపిసోడ్​కు చేరుకుంది. డిసెంబర్‌ 4న ఆదివారం ప్రసారం కానుంది. గతంలో ఢీ ఫైనల్ ఎపిసోడ్స్​కు ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు రాగా ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్​ విడుదల కాగా ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో రవితేజ.. తన మార్క్​ కామెడీ, బాడీ లాంగ్వేజ్​తో ఫుల్​ జోష్ నింపేశారు. అందర్నీ తెగ నవ్విచేశారు. ఈ క్రమంలోనే హైపర్​ ఆదిపై పంచ్​లు వేస్తూ కితకితలు పెట్టించారు. 'ఈ షోకు నీకు సంబంధం ఏంటని' హైపర్‌ ఆదిని అనడంతో నవ్వులు విరబూశాయి. ఇక రవితేజ తన కామెడీతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, రవితేజ ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. ఇక ఆయన నటించిన ధమాకా మూవీ రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య మూవీలోనూ స్పెషల్ రోల్​లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి: అందాల బొమ్మలా నివేదా పేతురాజ్​ లుక్స్​ చూస్తే మతిపోయేలా

Last Updated : Dec 1, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.