ETV Bharat / entertainment

తారక్​పై​ మరో సూపర్​ యాక్షన్‌ సీక్వెన్స్‌.. మొన్న అండర్​ వాటర్​లో.. ఈ సారి ఏకంగా..! - ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్​ అప్డేట్స్​

Devara NTR movie : జూనియర్​ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం 'దేవర'. ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్​ వచ్చింది. ఆ వివరాలు..

NTR Devara
NTR Devara
author img

By

Published : Jun 26, 2023, 3:17 PM IST

Updated : Jun 26, 2023, 4:03 PM IST

Devara NTR movie : జూనియర్​ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్​టైనర్​ చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్​ భామ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్లో రీసెంట్​గా ప్రారంభమైన సంగతి సినీ ప్రియులకు తెలిసిన విషయమే. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్​ సాగింది. తాజాగా ఇది పూర్తైనట్లు సమాచారం అందింది.

ఇందులో భాగంగా ఓ కీలక వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించినట్లు రీసెంట్​గా వార్తలు కూడా వచ్చాయి. దీనికి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెన్నీ బేట్స్‌ నేతృత్వం వహించినట్లు సమాచారం అందింది. అయితే తాజాగా సినిమాటోగ్రాఫర్​ ఆర్​ రత్నవేలు కూడా ఓ పోస్ట్ చేస్తూ.. ఓ యాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కించినట్లు తెలిపారు. ఎక్స్​ట్రీమ్​ లోలైట్​లో ఈ యాక్షన్ సీక్వెన్స్​ను చిత్రీకరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్​లో వేసిన సెట్​లో స్పెషల్​ నైట్​ ఎఫెక్ట్​ యాక్షన్​ సీక్వెన్స్​ రూపొందినట్లు ఓ ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దాన్ని ట్రెండ్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. సినిమాపై మరింత అంచనాలను పెంచేసుకుంటున్నారు.

NTR Devara
తారక్​పై​ లోలైట్​ స్పెషల్​ నైట్​ ఎఫెక్ట్​లో యాక్షన్‌ సీక్వెన్స్‌

NTR 30 cast and crew : ఇకపోతే ఈ మూవీ నెక్ట్స్​ షెడ్యూల్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని అంతా అంటున్నారు. ఈ సినిమా తారక్‌ ఓ సరికొత్త లుక్‌తో కనిపించనున్నట్లు ఇప్పటికే రిలీజైన పోస్టర్​ను చూస్తే అర్థమవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

JR Ntr koratala siva movie : సూపర్‌హిట్‌ చిత్రం 'జనతా గ్యారేజ్​' తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కలిసి పనిచేస్తుండడంతో 'దేవర'పై మంచి అంచనాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. ప్రతినాయకుడిగా ప్రముఖ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తుండడం వల్ల ఈ సినిమా అందరి దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. భయమంటే ఏమిటో తెలియని అక్కడి మృగాళ్లకు భయాన్ని రుచి చూపించేందుకు హీరోగా ఎన్టీఆర్​ ఏం చేశాడన్నది ఈ సినిమా కథాంశం. మొత్తంగా యాక్షన్‌ డ్రామాగా శక్తిమంతమైన కథ, కథనాలతో చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్​ మ్యూజిక్​ సెన్సేషన్​ అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్య వహరిస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌: సాబు సిరిల్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

తాతకు తగ్గ మనవడు.. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!

Janhvi Kapoor Movies : జాన్వీ.. ఎక్కడున్నావ్​?.. కాస్త కనిపించవమ్మా!

Last Updated : Jun 26, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.