ETV Bharat / entertainment

ఇన్నేళ్లకు మాజీ లవర్​తో రణ్​బీర్​.. 'బ్రహ్మాస్త్రం'లో దీపిక! - brahmastra release date

బాలీవుడ్​ హ్యాండ్సమ్​ హీరో రణ్​బీర్​ కపూర్​- అందాల తార దీపికా పదుకొణె చాలా ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్నా.. అభిమానుల్లో ఈ జంటకు ఉండే క్రేజే వేరు. అయితే దాదాపు ఏడేళ్లుగా కలిసి సినిమాలు చేయని ఈ మాజీ లవర్స్​.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్రం'లో సందడి చేయనున్నట్లు సమాచారం.

Deepika padukone
Deepika padukone brahmastra
author img

By

Published : Jun 16, 2022, 9:03 PM IST

బాలీవుడ్ స్టార్​ కపుల్ రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్ బుధవారం విడుదలైంది. ట్రైలర్​కు మిశ్రమ స్పందన వస్తున్నా.. ఓ పాత్ర గురించి మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. అదే సూపర్​స్టార్ షారుక్​ ఖాన్​కు సంబంధించిన ఓ సీన్​! ఆ పాత్రను ట్రైలర్​లో రివీల్​ చేయకున్నా.. ఓ సీన్​లో వెనకవైపు నుంచి కనిపించేది ఆయనే అంటూ బాగా వైరల్​ అవుతోంది. ఈ సినిమాలో షారుక్​.. ఓ శాస్త్రవేత్త పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది.

brahmastra
'బ్రహ్మాస్త్రం' సెట్​లో రణ్​బీర్-ఆలియా
Deepika padukone
దీపిక

అయితే మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే 'బ్రహ్మాస్త్రం'లో.. రణ్​బీర్​ మాజీ ప్రేయసి, అగ్రతార దీపికా పదుకొణె కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు దీపిక ఓకే చెప్పిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సమాచారమే నిజమైతే.. వివాహం అనంతరం వీరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతంది.

Deepika padukone
దీపికా పదుకొణె

2015లో వచ్చిన 'తమాషా' తర్వాత రణ్​బీర్-దీపిక జంటగా నటించలేదు. 2018లో రణ్​వీర్​ సింగ్​ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రణ్​బీర్​తో కలిసి కనపడలేదు దీపిక. రణ్​బీర్​ కూడా తన ప్రేయసి ఆలియా భట్​ను ఇటీవలే వివాహం చేసుకున్నాడు.

Deepika padukone
దీపిక

'బ్రహ్మాస్త్రం'.. సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రాన్ని దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌, నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మరోసారి లవర్​బాయ్​గా చైతూ అదుర్స్​.. అగ్ర హీరోలతో సమంత ఢీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.