Shivaji Ganeshan Property Issue: తండ్రి ఆస్తిలో తమకు భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన నటుడు ప్రభు, రామ్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తూ శివాజీ గణేశన్ కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌కు కుమారులు ప్రభు, రామ్‌కుమార్, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తమకు తెలియకుండా ఆస్తులను విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలన్నారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్‌కుమార్ అపహరించారని, శాంతి థియేటర్లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాలను వారిద్దరి పేరిటకు మార్చుకున్నట్లు ఆరోపించారు. శివాజీ గణేశన్ రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభు, రామ్కుమార్ల కుమారులు విక్రమ్ ప్రభు, దుశ్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
ఇవీ చదవండి: 'చిరంజీవి వల్లే 'గాడ్ ఫాదర్'లో ఆ లుక్‌లో నటించా'