టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-కమెడియన్ అలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. మంచి స్నేహితులు అనగానే చాలా మందికి టక్కున వీరి పేర్లే గుర్తొస్తాయి. ఎన్నో ఏళ్ల నుంచి వీరి స్నేహబంధం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో దాదాపుగా అలీ తప్పకుండా ఉంటారు. అంతలా వీరిమధ్య అనుబంధం ఉండేది. అయితే కొద్ది కాలం క్రితం నుంచి వీరిద్దరు కలిసి ఒకే చోట కనపడట్లేదు.
ఇక కొన్ని రోజుల క్రితం అలీ పెద్ద కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు, మంచు విష్ణు, తదితరులు హాజరయ్యారు. ఇక గుంటూరులో నిర్వహించిన రిసెప్షన్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరై.. నూతన దంపతులును ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన వీడియోల, ఫోటోలను అలీ భార్య.. జుబేదా.. ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంది.
అయితే ఈ వివాహ వేడుకకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పవన్, అలీ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలుసు. అలాంటిది.. అలీ కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ రాకపోవడంతో.. వారి బంధం గురించి పలు అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా నటుడు అలీ స్పందించాడు. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి గల కారణాలు వివరించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. "నా కుమార్తె పెళ్లికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాను. వివాహానికి రావాల్సిందిగా శుభలేఖ కూడా ఇచ్చాను. ఆయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు. దాంతో అయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారు. కానీ చివరి నిమిషయంలో ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారు. దాంతో ఆయన నాకు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాక వధూవరులు ఇద్దరు ఇంటిలో ఉన్నప్పుడు చెప్పు.. నేను ఇంటికి వచ్చి కలుస్తాను అన్నారు" అని తెలిపారు అలీ.
ఇదీ చూడండి: Pawan luxury bikes షూటింగ్ గ్యాప్‌లో ఖరీదైన బైక్‌పై పవర్ స్టార్ రైడ్
ఘనంగా ఆలీ కుమార్తె వివాహ వేడుక చిరంజీవి నాగార్జున సందడే సందడి