ETV Bharat / entertainment

ఆ రోజు మెగా ఫ్యాన్స్​కు స్పెషల్ సర్​ప్రైజ్​

author img

By

Published : Jun 29, 2023, 3:22 PM IST

Chiranjeevi new movie 2023 : మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గురించి ఓ సమాచారం అందింది. ఆ రోజు మెగా ఫ్యాన్స్​కు స్పెషల్ సర్​ప్రైజ్​ ఉండనుందట. అదేంటంటే?

Chiranjeevi
ఆ రోజు మెగా ఫ్యాన్స్​కు స్పెషల్ సర్​ప్రైజ్​

Chiranjeevi new movie 2023 : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్​లో ఉన్నారు. రీఎంట్రీలో 'ఖైదీ నెo.150'తో మంచి హిట్​ అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్​లకు సైన్​ చేసేశారు. కానీ 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్​ఫాదర్'​తో తన రేంజ్​కు తగ్గట్టు భారీ హిట్​ను అందుకోలేదు. అయితే 'వాల్తేరు వీరయ్య'తో మాత్రం భారీ కమర్షియల్​ హిట్​ను అందుకుని.. రెండు వందల కోట్ల క్లబ్ హీరోల్లో చేరిపోయారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ 'భోళాశంకర్‌' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో తమన్నాకు హీరోగా.. కీర్తిసురేశ్​కు అన్నయ్యగా నటిస్తున్నారు. ముంబయి బ్యాక్​డ్రాప్​లో రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Kalyan krishna kurasala movies : దీంతో చిరంజీవి.. తర్వాత నటించాల్సిన తన కొత్త సినిమాలను లైన్​లో పెట్టే పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు కూడా జరిపారు. ఇందులో భాగంగానే ఆయన బంగార్రాజు ఫేమ్​ కల్యాణ్‌ కృష్ణ కురసాలతో సినిమా ఓకే చేశారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. చిరు పుట్టిన రోజు ఆగస్ట్ 22న ఈ మూవీ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నారట. అందుకు కావాల్సిన ఏర్పట్లను కూడా చేస్తున్నారని తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చిరు పుట్టినరోజు కొత్త సినిమా ప్రకటన రావడం ఖాయం. ఇప్పటికే ఈ వార్త కొంతమంది చిరు అభిమానులకు తెలిసి ఫుల్​ ఖుషి అవుతున్నారు.

Chiru 156 movie : ఇక కల్యాణ్‌ కృష్ణ కురసాలతో చేయబోయే సినిమాలో నటించే నటీనటుల గురించి ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ​ఇందులో చిరు సరసన ఆయన భార్యగా.. ప్రస్తుతం ఫామ్​లో ఉన్న సీనియర్ హీరోయిన్​ త్రిష నటించనుందట. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ జోడీ కలిసి నటించనున్నారు. చివరిసారిగా వీరిద్దరు కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు. ఇక డీజే టిల్లు ఫేమ్​ సిద్ధు జొన్నలగడ్డ కూడా మరో ప్రధాన పాత్ర పోషించనున్నారట. ఆయన.. చిరుకు కొడుకుగా నటించే అవకాశముంది. మలయాళంలో సూపర్​ హిట్​గా నలిచిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనుందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

17ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-త్రిష.. కన్ఫామ్​ అయినట్టే!

'స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్లే'.. తెలంగాణ యాసలో దుమ్మురేపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.