ETV Bharat / entertainment

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా - చిరంజీని సంక్రాంతి విషెస్

Chiranjeevi Sankranthi Family Photo : సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్​ చిరంజీవి ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 4:54 PM IST

Chiranjeevi Sankranthi Family Photo : ఏ పండగ వచ్చినా మెగాస్టార్​ చిరంజీవి కుటుంబమంతా గెట్‌ టు గెదర్‌ అవుతారన్న సంగతి తెలిసిందే. గతేడాది మెగా వారసురాలు క్లీంకార జన్మించడం, వరుణ్‌ తేజ్‌-లావణ్యల పెళ్లి జరగడంతో ఈ సంక్రాంతి ఆ కుటుంబానికి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఒక్క ఫొటోతో మెగా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు చిరంజీవి.

నాలుగు రోజుల నుంచి సంక్రాంతి సంబరాలు మెగాస్టార్ ఇంట ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవి - అల్లు అరవింద్‌ ఫ్యామిలీ మెంబర్స్​ అందరూ బెంగళూరులోని రామ్‌ చరణ్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకొని అక్కడే వేడుకను గ్రాండ్​గా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ చిరు నేడు(జనవరి 15) ఓ ఫొటోను షేర్‌ చేశారు. "పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!" అని చిరు రాసుకొచ్చారు. ఇందులో మెగా కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన అందరూ ఉండడంతో నెటిజన్ల, అభిమానుల ఆనందం అంబరాన్నంటింది.

ఈ పిక్​లో ప్రతిఒక్కరూ రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్‌ డ్రెస్‌లు ధరించారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్​ వైరల్‌ అవుతోంది. ఇందులో అకీర స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడంటూ కొందరు నెట్టింట్లో కామెంట్స్‌ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్​ కూడా ఉండుంటే ఫ్రేమ్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యేదంటూ మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  • పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి
    ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! pic.twitter.com/4rpfN0s6lZ

    — Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇకపోతే ఈ మెగా ఫ్రేమ్​లో అకిరా నందన్‌ లుక్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్​గా మారింది. అచ్చం పవన్​లానే అకిరా ఉన్నాడంటూ కామెంట్స్​ చేస్తున్నారు. గుబురు జుట్టు, గడ్డం, మీసంతో అచ్చం పవన్​లాగే ఉన్నాడని అంటున్నారు. పవన్‌ యంగేజ్‌లోని లుక్‌ను, ఇప్పటి అకిరా లుక్​ను పోల్చుతూ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు అకిరా, ఆద్యాల వీడియోను పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ షేర్‌ చేశారు. అకిరా, అద్యాల ఫొటోకు అన్నవరం సినిమాలోని అన్నచెల్లెల సెంటిమెంట్‌తో సాగే సాంగ్​ను జత చేసి వీడియో షేర్‌ చేశారు.

'నా సామి రంగ' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఊహించిన దాని కన్నా ఎక్కువగా!

దూసుకుపోతున్న 'హనుమాన్'​ - 'కేజీఎఫ్', 'కాంతారా' కలెక్షన్​ రికార్డ్స్​ బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.