ETV Bharat / entertainment

Laal Singh chaddha: 'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్​ చిరంజీవి - చిరంజీవి నాగచైతన్య

'లాల్‌సింగ్‌ చడ్డా'లోని హీరో నాగచైతన్య లుక్​ను రిలీజ్​ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు.

laal singh chaddha nagachaitanya
లాల్​ సింగ్​ చద్ధా నాగచైతన్య
author img

By

Published : Jul 20, 2022, 8:30 PM IST

Nagachaitanya Lal singhChaddha: బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​తో కలిసి హీరో నాగచైతన్య నటించిన హిందీ చిత్రం 'లాల్‌సింగ్‌ చడ్డా'. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాహీరో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్న నేపథ్యంలో చైతన్య పాత్రకు సంబంధించిన లుక్​ను రిలీజ్​ చేశారు చిరు. "లాల్‌సింగ్‌ చడ్డా, చెడ్డీ బడ్డీ 'బాలరాజు'ను మీకు పరిచయం చేస్తున్నా. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు" అంటూ పోస్టర్‌ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. దర్శకుడు అద్వైత్‌ చందన్‌.. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. కరీనా కపూర్‌ కథానాయిక.

బౌన్సర్‌ కథ.. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో తమన్నా 'బబ్లీ బౌన్సర్‌' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో సెప్టెంబరు 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం తమన్నా లుక్‌ను విడుదల చేసింది. భారతదేశంలో తొలిసారి రూపొందుతున్న ఓ మహిళా బౌన్సర్‌ కథ ఇదేనని, బాక్సర్స్‌ టౌన్‌గా పేరు తెచ్చుకున్న అసోలా ఫతైపూర్‌ నేపథ్యంలో రూపొందుతోందని చిత్ర బృందం తెలిపింది.

ఇదీ చూడండి: 'బింబిసార' ఎన్టీఆర్​ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న యంగ్​ టైగర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.