ETV Bharat / entertainment

ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి: చిరంజీవి - చిరంజీవి కృష్ణవంశీ

'రంగమార్తాండ' సినిమాతో పాటు మ్యూజిక్ డైరెక్టర్​ ఇళయరాజా గురించి మాట్లాడారు మెగాస్టార్ చిరింజీవి. ఆ వీడియో చూసేయండి..

Chiranjeevi Ilayaraja
ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి: చిరంజీవి
author img

By

Published : Dec 16, 2022, 1:29 PM IST

Updated : Dec 16, 2022, 1:54 PM IST

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆవిష్కృతం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నటసామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమైంది.

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి స్వయంగా ఓ షాయరీ చెప్పారు. ఈ కవితాఝరిని డిసెంబర్‌ 21న ఉదయం 11.07 ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కృష్ణవంశీ తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఇళయరాజా, 'రంగమార్తాండ' సినిమా గురించి చిరు మాట్లాడారు. ఇళయరాజాపై ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ చిత్రంలో ఆదర్శ్‌ బాలకృష్ణ, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రొఫెషనల్​ సింగర్​లా ఇంద్రజ​.. స్టేజ్ దద్దరిల్లేలా రష్మీ, సౌమ్య డ్యాన్స్​

Last Updated : Dec 16, 2022, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.