ETV Bharat / entertainment

రామ్-బోయపాటి మూవీ.. ఫస్ట్ థండర్​ బ్లాస్ట్​.. యాక్షన్​ వేరే లెవెల్​! - బోయపాటి రామ్​పోతినేని ఫస్ట్​ లుక్​

బోయపాటి శ్రీను-రామ్​పోతినేని కాంబోలో తెరకెక్కుతున్నసినిమా నుంచి అదిరిపోయే వీడియో రిలీజైంది. ఇందులో రామ్ డైలాగ్స్​, యాక్షన్స్​ సీన్స్​ అదిరిపోయాయి. చూసేయండి..

Boyapati rampotineni movie
బోయపాటి-రామ్​పోతినేని మూవీ.. ఫస్ట్ థండర్​ బ్లాస్ట్​..
author img

By

Published : May 15, 2023, 11:57 AM IST

Updated : May 15, 2023, 12:28 PM IST

ఇండస్ట్రీలో మాస్ సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ఆయన రూపొందించే సినిమాలు మాస్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఆయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ఓ భారీ యాక్షన్​ మాస్​ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్​ను ఇప్పటి వరకూ చూడని రూపంలో మాసీగా చూపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. అయితే నేడు(మార్చి 15) హీరో రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీటీమ్​ అదిరిపోయే సర్​ప్రైజ్​ అప్డేట్​ ఇచ్చింది. ఫస్ట్ థండర్ పేరుతో ఓ యాక్షన్​ గ్లింప్స్​ను రిలీజ్ చేసింది. ఇందులో రామ్.. మాసీ లుక్​లో ఊరమాస్​గా అదిరిపోయేలా ఉన్నారు.

రామ్​ ఓ పెద్ద కత్తితో నడుచుకుంటూ వస్తున్న సన్నివేశంతో ప్రారంభమైన ఈ వీడియోలో.. ఆ తర్వాత బాంబు పేలుడు ధాటికి జీపులోని విలన్స్ అంతా కత్తులతో చెల్లాచెదురుగా కింద పడతారు. అనంతరం ఓ జాతరలో దున్నపోతును పట్టుకుని రామ్ పవర్​ఫుల్​ లుక్​లో ఎంట్రీ ఇస్తారు. 'నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా.. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సు...' అంటూ రామ్​ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. విలన్స్​పై రామ్ విరుచుకుపడే​ విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా హైలెట్​గా ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ వీడియోను రిలీజ్​ చేశారు.

ఇకపోతే ఈ సినిమా విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్​ లుక్​లో దున్నపోతుతో ఉన్న రామ్​ను, ప్రస్తుత ట్రైలర్​లోనూ అదే సీన్​ను హైలైట్​ చేశారు. సినిమా మొత్తానికి దున్నపోతుతో నడిచేటప్పుడు జరిగే ఫైట్​ హైలైట్​గా నిలవనుందట. భారీ ఖర్చు పెట్టి దీన్ని చిత్రీకరించారట. ఇది కాకుండా మరో యాక్షన్​ సన్నివేశాన్ని కూడా భారీగా తీశారట. ఇందులో 1500మందితో రామ్​ తలపడనున్నారట.

కాగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్​పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్​తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానుంది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్​తో చిందులేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: డబుల్ ఇస్మార్ట్.. పూరి ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో?

Last Updated : May 15, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.