ETV Bharat / entertainment

రూ.120 కోట్ల బ‌డ్జెట్.. రూ.10 కోట్ల క‌లెక్ష‌న్స్.. అక్షయ్​ 'సెల్ఫీ' నష్టాలు తేనుందా? - సెల్ఫీ మూవీ వసూళ్లు

బాలీవుడ్​ స్టార్​ హీరోలు అక్ష‌య్ కుమార్, ఇమ్రాన్ హ‌ష్మీ న‌టించిన సెల్ఫీ మూవీ క‌లెక్ష‌న్స్ బాలీవుడ్ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేస్తున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

bollywood actor akshay kumar selfie movie collections

author img

By

Published : Feb 27, 2023, 12:44 PM IST

Selfiee Collections: బాలీవుడ్​ స్టార్​ హీరో అక్ష‌య్ కుమార్ సెల్ఫీ మూవీ.. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చనుందా అంటే అవుననే అంటున్నారు సినీ పండితులు. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.ప‌ది కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది.

తొలిరోజు రూ. 2.5 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ ఈ సినిమా.. రెండో రోజు రూ. 3.8 కోట్లు, మూడు రోజు రూ.3.89 కోట్లు రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ.10.24 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని షాక్‌కు గురిచేసింది. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ సినిమా క‌ష్టంగా రూ.ప‌ది కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా ఆధారంగా సెల్ఫీ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాకు రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్ష‌య్‌కుమార్‌తో పాటు ఇమ్రాన్ హ‌ష్మీ మ‌రో హీరోగా న‌టించాడు. ఓ సినిమా స్టార్‌, ఆర్‌టీఓ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య పోరాటం నేప‌థ్యంలో యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌గా సెల్ఫీ రూపొందింది. మ‌ల‌యాళ వెర్ష‌న్ నాలుగేళ్ల క్రితం రిలీజైంది. అప్ప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల అభిరుచులు మార‌డం సెల్ఫీ ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి. అక్ష‌య్‌కుమార్‌కు ఇది ఎనిమిదో ప‌రాజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. అత‌డు న‌టించిన గ‌త ఏడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.