Bigg Boss Telugu 7 Wild Card Entries : బిగ్ బాస్ 7వ సీజన్.. "ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఇంకో లెక్క.. అంతా ఉల్టా పల్టా" అన్నారు. దీంతో జనాల్లో ఒక క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేయగలిగారు. కానీ.. దాన్ని పర్ఫెక్ట్గా కొనసాగిస్తున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఇప్పటి దాకా ఐదుగురు హౌస్ నుంచి బ్యాగ్ సర్దేశారు. అయితే.. వీరంతా లేడీసే కావడం గమనార్హం. ఒక్క మేల్ కంటిస్టెంట్ కూడా ఎలిమినేట్ కాలేదు. పోనీ.. వెళ్లిన వారిలో అందరూ పూర్ క్యాండిడేట్సేనా అంటే అదీ కాదు. చివరి వరకూ పోటీ ఇవ్వగలదు రతిక లాంటి వారు కూడా ఎలిమినేట్ అయిపోవడంతో ఆడియెన్స్‌కు షాక్ తగిలింది.
Bigg Boss Telugu 7 Season 2.0 : ఈ ఆదివారం డబుల్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకేసారి ఇద్దరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. వారిలో ఒకరు శుభశ్రీ కాగా.. మరొకరు గౌతమ్ కృష్ణ. ఈ డబుల్ ఎలిమినేషన్‌ను ఎవ్వరూ ఊహించలేదు. అయితే.. ఆ వెంటనే మరో ట్విస్ట్ ఇవ్వడం విశేషం. గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లోకి పంపేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 7 సీజన్ 2.0ను అనౌన్స్ చేసేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి కొత్త వాళ్లు వస్తున్నట్టు ప్రకటించాడు.
Bigg Boss Subhashree : బిగ్‌బాస్ హౌస్ నుంచి క్యూటీ ఔట్.. 5వారాలకు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?
Five Members With Wild Card Entry in to Bigg Boss Telugu 7 : ఇలా వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినవాళ్లు ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఐదుగురు ఉన్నారు. ఇంత మందిని మధ్యలో హౌస్‌లోకి పంపిస్తున్నామని చెప్పడం ద్వారా ఆడియెన్స్‌లో మరోసారి క్యూరియాసిటీ పెంచారు. కానీ.. ఆ వచ్చిన వాళ్లను చూసిన తర్వాత నీరుగారిపోయామని స్వయంగా ఫ్యాన్సే సోషల్ మీడియా వేదికగా చర్చ చేస్తున్నారు. ఎవరెవర్నో తీసుకొచ్చి హౌస్‌లో వదిలారంటూ బిగ్‌బాస్ పై సెటైర్లు వేస్తున్నారు. హీరో కార్తి ఫేమస్ మీమ్ "ఎవర్రా మీరంతా" ఫొటోను వాడుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన వాళ్లపై కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Rathika Rose Remuneration : 4 వారాలకు రతిక గట్టిగానే తీసుకుందిగా!.. ఏకంగా ఎన్ని లక్షలంటే?
వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారి వివరాలు చూస్తే.. ఒకరు అర్జున్ అంబటి. ఇతను సీరియల్ యాక్టర్. ఇంకా డ్యాన్సర్ కూడా. మరొకరు పూజా మూర్తి. ఈమె కూడా సీరియల్ యాక్ట్రెస్. అసలు ఈమె స్టార్టింగ్ నుంచే ఉండాల్సింది కానీ.. తండ్రి మరణంతో ఆగిపోయింది. ఇక, మూడో వ్యక్తి బోలే షావలి. తెలంగాణ పాటలతో యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటాడు. టిక్ టాక్ ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్ అయిన నయన పావని కూడా వైల్డ్ కార్డ్ పట్టుకొని వచ్చింది. మరో ఇన్‌స్టా ఇన్ ఫ్లూయెన్సర్ అశ్విని శ్రీ కూడా హౌస్‌లోకి వచ్చింది. తన బ్యూటీతో రతిక లోటును భర్తీ చేస్తుందని అనుకుంటున్నారు.
అయితే.. వీళ్లలో ఎవరూ జనాలకు పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు కాదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే కొద్ది మందికి తప్ప, ఇతరులకు తెలిసింది తక్కువే. మరి, వీళ్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి రావడం.. బిగ్‌బాస్ 7వ సీజన్‌కు ఎంత వరకు మేలు చేస్తుంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వీళ్ల ద్వారా ఈ సీజన్ మరింత కలర్ ఫుల్‌గా మారుతుందా? లేదంటే.. ఉన్న టీఆర్పీకి ఎసరు వచ్చి పడుతుందా? అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కంటిన్యూ అయ్యే 7వ సీజన్ 2.0 ఎలా ఉంటుందో చూడాలి.