ETV Bharat / entertainment

బిగ్​బాస్ శివాజీ కొత్త సినిమా అనౌన్స్​మెంట్​​ - 'కూర్మ నాయకి'తో రీఎంట్రీ - బిగ్​బాస్ శివాజీ కొత్త సినిమా

Bigg Boss 7 Sivaji New Movie : చాలా గ్యాప్‌ తర్వాత బిగ్‌బాస్‌ శివాజీ వెండితెరపై గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటించబోతున్న కొత్త సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజైంది. ఇది ఆకట్టుకునేలా ఉంది.

బిగ్​బాస్ శివాజీ కొత్త సినిమా అనౌన్స్​మెంట్​​ - 'కూర్మ నాయకి'తో రీఎంట్రీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 10:03 PM IST

Bigg Boss 7 Sivaji New Movie : రీసెంట్​గా బిగ్​బాస్​తో మళ్లీ వెలుగులోకి వచ్చిన నటుడు శివాజీ ఆ వెంటనే #90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ వెబ్‌సిరీస్​తో ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ రెండిటి ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు వెండితెరపై మరోసారి అలరించబోతున్నారు. అదీ కూడా ఓ సరికొత్త కంటెంట్‌తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ మోషన్​ పోస్టర్​ను రిలీజ్ చేశారు. కూర్మ నాయకి అనే టైటిల్​తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్​గా ప్రారంభమైనట్లు తెలిసింది. ఈ చిత్రంతో హర్ష కడియాల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎంఎం క్రియేషన్స్ బ్యానర్​లో మొదటి సినిమాగా విజిత్ రావు నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

సరికొత్త శివాజీని చూడబోతున్నారు : ఈ మోషన్​ పోస్టర్‌ చివర్లో శివాజీ మాట్లాడుతూ "హాయ్‌ అందరికి. మీరు చూసిన 'కూర్మ నాయకి' మోషన్‌ పోస్టర్‌ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా రీఎంట్రీలో నేను నటించబోతున్న నా మొట్టమొదటి సినిమా ఇది. ఇందులో నేను ఏం చేయబోతున్నాను, నేను ఎలా ఉండబోతున్నాను త్వరలోనే నా క్యారెక్టర్‌, దాని డిజైన్స్‌, మోషన్‌ పోస్టర్‌, నా ఎంట్రీ అన్ని కూడా త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో మీరు సరికొత్త శివాజీని చూడబోతున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.

విచిత్రమైన కథగా : సాధారణంగా మనుషులు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తొలిగించమని దేవుడిని వేడుకుంటారు. తమకు ధైర్యం ప్రసాదించమని ప్రార్థిస్తారు. ఎంతటి పెద్ద సమస్యైనా తీర్చేది దేవుడే అని మనుషుల విశ్వాసం. మరి అలాంటి దేవుడికే సమస్య వస్తే అది కూడా మనుషులు వల్లే ఆ సమస్య ఎదురైతే వంటి విచిత్రమైన కథతో రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాలీవుడ్​లో తెలుగమ్మాయి సంచలనం - అందం అసూయపడేలా ఉంది

సంక్రాంతి స్పెషల్​ : ఈ వారం ఓటీటీలోకి 45 సినిమా/సిరీస్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.