ఇప్పటికి అప్పటికీ ఏఆర్ఆర్ పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్లాసిక్, రాక్, పాప్ ఇలా ఎటువంటి మెలొడీనైనా ఇట్టే సృష్టిస్తారు ఆయన. ఆయన అందించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్‌లో ప్రేమికుడు టాప్ పొజీషన్లో ఉంటుందనే చెప్పాలి. ప్రేక్షకులను అంతలా కిరక్రెంచాయి ఈ పాటలు. ఇందులోని స్మూత్ సాంగ్స్ ఒక ఎత్తు అయితే ఒక్క ' ముక్కాలా ముక్కాబులా' సాంగ్ మరో ఎత్తు.. కానీ ఇలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కంపోజ్ చేయడానికి ఏఆర్ రెహమాన్‌కు సైతం కష్టమనిపించిందట.. అసలు ఏమైందంటే..
ప్రేమికుడు సినిమాలోని ఈ పాటకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చగా సింగర్ మనో గొంతు కలిపారు. మీరు తీక్షణంగా గమనించినట్లయితే ఈ సాంగ్‌లో మనో వాయిస్ ఆయన పాడిన మిగతా పాటల కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో మనో స్వరం గమ్మత్తుగా ఉంటుంది. ఆయన అప్పటి వరకు పాడిన పాటలకు ఈ పాటకు అసలు సంబంధం ఉండదు. మనో జీవితం 'ముక్కాలా' పాటకు ముందు, తర్వాత అనేలా మారిందంటే ఏ రేంజ్‌లో అలరించిందో అర్థమవుతుంది.
అయితే పాట రికార్డింగ్ కోసం ఏఆర్‌ఆర్‌తో పాటు రచయిత.. సింగర్ మనోను తెల్లవారు జామున 3 గంటలకు ఈ పాడేందుకు పిలిచారట. ఆ సమయంలో అతని చేత వేర్వేరు వాయిస్‌లతో కొంచం డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో పాడించినప్పటికీ సాంగ్‌కు రావాల్సిన ఫీల్ రాలేదట. దీంతో రెహమాన్ 'సంగీతం ఉంటే పాట పాడటం కాదు, నీ స్వరానికే సంగీతం ఇచ్చేలా చేయి' అని మనోతో అన్నారట. అంతే అంత సేపు సుదీర్ఘ ఆలోచనలో ఉన్న మనో.. ఉదయాన్నే ఈ ఛాలెంజ్ మనకు అవసరమా అనుకుని టీ తాగేందుకు రికార్డింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చారట. టీ తాగుతుండగా అక్కడున్న ఓ వాచ్‌మెన్ హిందీలో పాడుతుంటే అది విని, వెంటనే రెహమాన్ దగ్గరకు వెళ్లి అదే విధానంలో పాడి చూపించారట.
'చాలా బావుంది. కొనసాగించు .. చరణం మొదలు పెట్టు అంటూ' రెహమాన్ పదిహేను నిమిషాల్లో పాటను పూర్తి చేయించారు. అలా ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మనో.ఇప్పటికీ ఈ సాంగ్ చార్ట బస్టర్‌గా నిలుస్తోంది. అంతే కాకుండా లేటెస్ట్గా వచ్చిన ప్రభుదేవా సినిమా ఏబీసీడీ 2లోనూ ఈ సాంగ్ రీ క్రియేట్ చేశారు. దీని బట్టి అప్పటికి ఇప్పటికీ ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం మారలేదని అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">