ETV Bharat / entertainment

ఈ వారమే 'బీస్ట్'​, 'కేజీఎఫ్​-2'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే? - విజయ్ బీస్ట్ మూవీ రిలీజ్​ డేట్​

KGF 2, Beast movie release date: సినిమాకు సంబంధించి సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్‌ అంటే వేసవి కాలమే. అందుకే ఈ సమయంలోనే చిత్రాలు అధిక సంఖ్యలో విడుదలవుతుంటాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్‌', 'ఆర్‌ఆర్‌ఆర్', 'గని' తదితర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరికొన్ని ఈ వారం రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సందడి చేయనున్నాయి. వాటిలో 'ఆర్​ఆర్​ఆర్'​, 'బీస్ట్' కూడా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో ఓసారి చూద్దాం..

kgf 2 release date
కేజీఎఫ్​ 2 రిలీజ్ డేట్​
author img

By

Published : Apr 11, 2022, 2:45 PM IST

KGF 2, Beast movie release date: 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్న సినిమాలు 'కేజీఎఫ్​-2', 'బీస్ట్'​. ఈ రెండు భారీ చిత్రాలు ఈ వారం థియేటర్లను దద్దరిల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈ చిత్రాలతో పాటు మరి కొన్ని మూవీస్​ కూడా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్​ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.

Vijay Beast movie release date: 'అరబిక్‌ కుత్తు' పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం 'బీస్ట్‌'. విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 13న విడుదలకానుంది. ఇందులో విజయ్‌.. మాజీ రా ఏజెంట్ వీర రాఘవన్‌ పాత్ర పోషించారు. 'ఈ సినిమాలో ఇప్పటి వరకూ చూడని కొత్త లుక్‌లో విజయ్‌ కనిపిస్తారు' అని దర్శకుడు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఆ లుక్‌ ఎలా ఉంటుంది? విజయ్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఏంటి? ఉగ్రవాదుల చెర నుంచి అమాయకపు ప్రజలను ఎలా కాపాడాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Yash KGF 2 movie release date: 'కేజీయఫ్‌-1'లో గరుడ మరణానంతరం ఏం జరిగింది? అనే ప్రశ్న 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2'పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఏప్రిల్‌ 14న ఈ ఉత్కంఠకు తెరపడనుంది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. పార్ట్‌ 1 దేశవ్యాప్తంగా ఘన విజయం అందుకోవడం, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి.

Hindi Jersy movie postpone: నాని హీరోగా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కి, ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం 'జెర్సీ'. హిందీలో ఇదే పేరుతో షాహిద్‌ కపూర్‌ హీరోగా రీమేక్‌ అయింది. ఈ చిత్రానికీ గౌతమ్‌ తిన్ననూరినే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 14న రావాల్సి ఉంది. కాకపోతే, 'కేజీయఫ్‌-2' రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఓటీటీ వేదికగా..

ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్‌ 14 (సోనీలివ్‌)

దహనం: ఏప్రిల్‌ 14 (ఎంఎక్స్‌ ప్లేయర్‌)

గాలివాన (వెబ్‌ సిరీస్‌): ఏప్రిల్‌ 14 (జీ 5)

బ్లడీ మేరీ: ఏప్రిల్‌15 (ఆహా)

ఇదీ చూడండి: Pranitha: తల్లికాబోతున్న నటి ప్రణీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.