ETV Bharat / entertainment

'బలగం' డైరెక్టర్​ వేణు కొత్త సినిమా అప్డేట్​ - బలగం డైరెక్టర్ కొత్త సినిమా అప్డేట్​

Balagam director venu new movie : ఓ సినిమా ఘన విజయం అందుకుంటే.. ఆ మూవీ దర్శకుడిపైనా సినీ ప్రియుల దృష్టి పడుతుంది. తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడా? అనే ఆసక్తి వారిలో నెలకొంటుంది. ఇప్పుడు 'బలగం' దర్శకుడు వేణుపై సినీ ప్రియుల దృష్టి పడింది. అయితే తాజాగా ఆయన తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.

Balagam director venu Yeldandi new movie announced
కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన 'బలగం' డైరెక్టర్​ వేణు
author img

By

Published : Jun 19, 2023, 9:10 PM IST

Updated : Jun 19, 2023, 10:40 PM IST

Balagam director venu new movie : ఓ వైపు సినిమాలతో మరోవైపు 'జబర్దస్త్‌' షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్య నటుడు వేణు యెల్దండి. రీసెంట్​గా 'బలగం' చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తన చిత్రంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఆయన నెక్ట్స్​ సినిమా అనౌన్స్​మెంట్​ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా మంది సినీ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే వేణు తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. తన రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని సోమవారం ప్రారంభించినట్టు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు పెన్ను, పేపర్‌ ఫొటోను షేర్‌ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు.. 'మరో 'బలగం'గా మంచి సక్సెస్​ను అందుకోవాలని కోరకుంటున్నా', 'ఆల్‌ ది బెస్ట్‌ వేణు..', 'మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ రాయ్​ అన్నా' అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి వేణు ఈసారి ఎలాంటి కథలో రాబోతున్నారు? ఎలాంటి చిత్రాన్ని రూపొందించబోతున్నారు? నటీనటులెవరు? అనేవి తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.

Balagam movie awards : 'బలగం' చిత్రం ఈ ఏడాది మార్చి 3న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తం ప్రతిష్టాత్మక తొమ్మిది పురస్కారాలను అందుకుంది. అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్స్​లోనూ సత్తా చాటింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులతో పాటు 'వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌', 'ఒనికో ఫిల్మ్‌ అవార్డు' వంటి పలు విదేశీ అవార్డులను కూడా ముద్దాడింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, రూపా లక్ష్మి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించి అద్భుతంగా నటించారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిందీ చిత్రం.కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ ఈ కథను నడిపించారు. అలాగే చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను ఎంతో బాగా చూపించారు. భీమ్స్ ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు. ఒకప్పుడు పల్లె ప్రజలంతా తెరలు కట్టి సినిమాలు చూసినట్టు.. ఈ చిత్రాన్ని ప్రస్తుత కాలంలోనూ తెలంగాణలోని పలు పల్లెల్లో ప్రదర్శించారు. ఈ సినిమాను చూసి గ్రామస్థులంతా భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్​ను అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు

హాస్యనటుల్లో ఈ కమెడియన్స్​ వేరయా..

Last Updated : Jun 19, 2023, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.