ETV Bharat / entertainment

Atlee Allu Arjun Movie : అట్లీకి ముందుంది అసలు పరీక్ష.. అల్లు అర్జున్​తో సినిమా అంటే అలా జరగాల్సిందే! - అల్లు అర్జున్​తో సినిమా అట్లీకి అసలు పరీక్ష

Atlee Allu Arjun Movie : 'జవాన్'​తో పాన్ ఇండియా లెవల్​లో భారీ బ్లాక్​ బస్టర్​ అందుకున్న దర్శకుడు అట్లీకి అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభం కానుంది. ఆ వివరాలు..

Atlee Allu Arjun Movie : అట్లీకి ముందుంది అసలు పరీక్ష.. అల్లు అర్జున్​ ఫైనల్​ టెస్ట్​లో పాస్​ అవుతారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 12:25 PM IST

Atlee Allu Arjun Movie : 'పుష్ప' సినిమా గ్రాండ్ సక్సెస్​తో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్​ డమ్​ పాన్​ ఇండియా లెవల్​లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2'తో పాటు తన కొత్త సినిమాకు సంబంధించిన పనులపై ఫుల్ బిజీగా ఉంటున్నారు. కథల విషయంలో ఆచితూచి మరీ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఆయనతో సౌత్​ టు నార్త్​ ప్రముఖ దర్శకనిర్మాతలంతా సినిమా చేసేందుకు క్యూ కడుతూ భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా జవాన్​తో పాన్ ఇండియా లెవల్​లో భారీ బ్లాక్​ బస్టర్​ అందుకున్న దర్శకుడు అట్లీ కూడా కలిసి బన్నీకి ఓ కథ వినిపించారు. ప్రస్తుతం ఈ కాంబో గురించే ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే నిజానికి పుష్ప తర్వాత బన్నీని ఇప్పటికే చాలా మంది దర్శకులు కలిశారు. మొదట కొరటల శివ, వేణు శ్రీరామ్​ కలిసి.. తమ కథలకు సంబంధించిన సింగిల్ లైన్ స్టోరీ చెప్పి బన్నీని ఇంప్రెస్​ చేశారు. కానీ బౌండెడ్​ స్క్రిప్ట్ విషయంలో మాత్రం మెప్పించలేకపోయారట. ఆ తర్వాత కూడా మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను, యాక్షన్​ డైరెక్టర్​ రోహిత్ శెట్టి, సురేందర్ రెడ్డి, మురగదాస్​, పుష్కర్​ అండ్ గాయత్రి, లింగుస్వామి, జైలర్ ఫేమ్​ నెల్సన్​ కుమార్​ ఇంకా చాలా మందే దర్శకులు కూడా బన్నీని కలిసి తన కథలతో ఇంప్రెస్​ చేసేందుకు ట్రై చేశారు. కానీ ఎవరు కూడా పాస్​ అవ్వలేకపోయారు!

ఇప్పుడు జవాన్​తో సూపర్ హిట్​ అందుకున్న డైరెక్టర్ అట్లీ ట్రై చేస్తున్నారు. అల్లు అర్జున్​తో కలిసి ఇప్పటికే కథపై చర్చలు కూడా జరిపారు. తాజాగా ముంబయిలో కూడా కలిసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి! దీంతో ఇక చిత్రం దాదాపుగా ఖరారైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఇక అధికార ప్రకటన కూడా త్వరలోనే వచ్చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే అట్లీకి కేవలం కథ చెప్పడంతో అయిపోలేదు. మరో అసలు పరీక్ష కూడా ఎదురుకానుంది.

అదేంటంటే.. అల్లు అర్జున్​ను తన బౌండెడ్​ స్క్రిప్ట్​తో అట్లీ మెప్పించగలగాలి. లేదంటే అల్లు అర్జున్​.. ప్రస్తుతానికి సినిమాను అధికారికంగా ప్రకటించినా.. ఆ తర్వాత పక్కన పెట్టడానికి అస్సలు వెనకాడరు. ఎందుకంటే పుష్ప గ్రాండ్​ సక్సెస్​ తర్వాత బన్నీపై మరింత బాధ్యత పెరిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్​లో ప్రేక్షకులను మెప్పించేలా స్టోరీస్​ను సెలెక్ట్ చేసి సినిమాలు చేయాలి. కాబట్టి అట్లీ.. అల్లు అర్జున్​ బౌండెడ్ స్క్రిప్ట్​ టెస్ట్​లో పాస్ అవుతారో లేదో..

Atlee Wife Telugu Family : పెళ్లి చేసుకుంటే హేళన చేశారు.. దర్శకుడు అట్లీ తెలుగింటి అల్లుడే అని తెలుసా?

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.