Animal Movie Day 1 Collections : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'యానిమల్' మూవీ తొలి రోజు మంచి కలెక్షన్లు అందుకుని దూసుకెళ్తోంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కేవలం ఇండియాలోనే సుమారు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తెలుగులో రూ.10 కోట్లు, హిందీలో రూ.50 కోట్లు, కన్నడ, తమిళం, మలయాళంతో కలిపి మొత్తంగా ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిందట.
-
He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/sIXDnGkfKu
">He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 2, 2023
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/sIXDnGkfKuHe has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
— Animal The Film (@AnimalTheFilm) December 2, 2023
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/sIXDnGkfKu
Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను పెంచారు. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
Animal Movie Sequel Update : మరోవైపు ఈ సినిమా అటు సెంటిమెంట్‌తో పాటు వయోలెన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనుందని డైరెక్టర్ రివీల్ చేశారు. దీంతో రానున్న 'యానిమల్ పార్క్'పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇదే టాక్ కొనసాగితే యానిమల్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్టోరీ ఏంటంటే :
స్వస్తిక్ స్టీల్స్ అధినేత, దేశంలోనే సంపన్న వ్యాపారవేత్త బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) తనయుడు రణ్ విజయ్ (రణ్‌బీర్ కపూర్). ఎవరినైనా సరే ధైర్యంగా ఎదురించే రకం. చిన్నప్పటి నుంచే నాన్నంటే ఎంతో ప్రేమ. కానీ, తన వ్యాపారాల వల్ల బిజీగా గడుపుతున్న బల్బీర్ కొడుకును అస్సలు పట్టించుకోడు. ఇక దూకుడు మనస్తత్వమున్న విజయ్ చేసే పనులు తండ్రి బల్బీర్‌సింగ్‌కి నచ్చవు. ఇద్దరి మధ్యా గొడవలు కూడా మొదలవుతాయి.
ఈ నేపథ్యంలో తను ప్రేమించిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకుని అతడు అమెరికా వెళ్లిపోతాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకుని హుటాహుటీన తన భార్య, పిల్లలను తీసుకుని ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తన తండ్రిని హత్య చేయాలనుకున్న విలన్‌ను విజయ్ ఎలా గుర్తించాడు? ఇంతకీ ఆ శత్రవు ఎవరు? అతని నుంచి ఆ ఫ్యామిలీని విజయ్ ఎలా కాపాడుకున్నాడనేది తెరపైన చూడాల్సిందే.
వైలెంట్ మోడ్ రణ్‌బీర్ కపూర్ - 'యానిమల్' మూవీ ఎలా ఉందంటే ?
తండ్రి కోసం ఓ కొడుకు చేసిన యుద్ధం - రణ్‌బీర్ పాత్రకు ఫుల్ మార్క్స్!