Amardeep Chowdary BiggBoss : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్‌దీప్ చౌదరి బాగా సుపరిచితమే. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన ఈ యంగ్ యాక్టర్ పేరు ప్రస్తుతం మీడియాలో మార్మోగిపోతోంది. హ్యాండ్సమ్ లుక్స్, యాక్టింగ్‌తో ఆకట్టుకునే ఈ సీరియల్ హీరో ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లోకి అడుగుపెట్టడమే ఇందుకు కారణం. గెలవాలనే తపన, కోరిక తనకు ఎక్కువని, నటుడు అమర్‌దీప్ అన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తాను ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడతానని చెప్పుకొచ్చాడు.
అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జన్మించారు. ఆయన తండ్రి అమీర్ బాషా. కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఈయన. ఇక అమర్దీప్ తల్లి రూపా. ఈమె కూడా నృత్యకారిణి. అలాగే ఓ పొలిటికల్ పార్టీ నాయకురాలు కూడా! అమర్‌దీప్ కూడా డ్యాన్స్ నేర్చుకుని కొన్ని పోటీల్లో పాల్గొన్నారట. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారట. లండన్‌లో మాస్టర్స్ అభ్యసించారని తెలిసింది. తిరిగొచ్చాక 2016 లో 'పరిణయం' అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం కేరళ తిరువనంతపురంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశారని తెలిసింది. కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు వచ్చి పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్, నా పబ్ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ,గర్ల్‌ఫ్రెండ్, డబుల్ డేట్ వంటి అనేక షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించారు.
Amardeep Chowdary Serials : 2017లో 'ఉయ్యాల జంపాలా' సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రాహుల్ అనే పాత్రతో ఆకట్టుకున్నారు. 2019లో 'సిరి సిరి మువ్వలు' అశ్విన్ అనే ప్రధాన పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా ప్రియాంక జైన్‌తో కలిసి 'జానకి కలగలేదు' సీరియల్లో నటించారు. అమర్దీప్ అత్తారింటికి దారేదిలో, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్స్‌లో గెస్ట్ రోల్స్ చేశారు. సీరియల్స్‌తో పాటు ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు మొదలైన చిత్రాలలో కూడా మెరిశారు.
TV Actor Amardeep Marriage : ఇక సీరియల్ నటి తేజస్వని గౌడతో ప్రేమలో పడ్డ అమర్దీప్... గతేడాది ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు. మరి కొత్తగా పెళ్లి చేసుకున్న అమర్ దీప్.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. మరి ఎలాంటి ఫెర్మామెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి..
Bigg boss 7 Telugu : కార్తీక దీపం మోనిత.. ఇన్ని కష్టాలు పడిందా? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా!