ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో పోటీ.. సవాల్​గా తీసుకుని చేశా: రామ్ ​చరణ్​ - ఎన్టీఆర్ ఫ్యామిలీపై రామ్​చరణ్ కామెంట్స్​

ఎన్టీఆర్​ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​. అలాగే తనకు స్ఫూర్తినిచ్చిన చిత్రాలేంటో తెలిపారు. తన కెరీర్​లో సవాలుగా తీసుకుని చేసిన సినిమా పేర్లను చెప్పారు. ఆ సంగతులు..

Ramcharan about NTR family
ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో పోటీ.. సవాల్​గా తీసుకుని చేశా: రామ్ ​చరణ్​
author img

By

Published : Jan 13, 2023, 7:29 PM IST

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఆ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఎన్టీఆర్‌తో కలిసి హాజరైన చరణ్‌ అక్కడి విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్​ కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని తెలిపారు. అలాగే 2022 తనకు ఎలా గడిచిందో వివరించారు. తనకు స్ఫూర్తినిచ్చిన సినిమాలేంటో కూడా చెప్పారు. ఆ సంగతులు..

ఆ చిత్రాన్ని సవాలుగా తీసుకుని చేశా.. "కొన్ని సినిమాల్లోని పాత్రలకు బాగా కష్టపడాల్సి వస్తుంది. నా కెరీర్‌లో సవాలుగా తీసుకుని చేసిన చిత్రం 'రంగస్థలం'. అందులో నేను పల్లెటూరి వ్యక్తిగా, చెవిటివాడి పాత్రలో కనిపిస్తా. దాన్నుంచి నటుడిగా మంచి అనుభవాన్ని గడించా. ప్రేక్షకులు ఆ సినిమాపై విశేష ఆదరణ చూపించి, ఇండస్ట్రీ హిట్‌ చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలోనూ ఛాలెంజ్‌ ఎదురైంది. దర్శకుడు రాజమౌళి నటుల హావభావాలపై ఎక్కువ ఫోకస్‌ చేస్తారు. ఆ ప్రక్రియను బాగా ఎంజాయ్‌ చేశా. ఈ చిత్రానికి జపాన్‌, అమెరికాలోనూ మంచి స్పందనరావడం చాలా ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా నేను డ్రామా, ఇంటెన్సివ్‌ సబ్జెక్ట్‌లను బాగా ఇష్టపడతా" అని చరణ్​ అన్నారు.

అవి స్ఫూర్తినిస్తాయి.. "హాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని వుడ్‌లు పోయి త్వరలోనే 'గ్లోబల్‌' సినిమా అనే పేరొస్తుందని ఆశిస్తున్నా. 'టాప్‌గన్' సిరీస్‌ చిత్రాలు నా ఫేవరెట్‌. ఇటీవల వచ్చిన 'టాప్‌గన్‌: మావెరిక్‌'లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేశాయి. అలాంటి సినిమాలు నాకు స్ఫూర్తినిస్తుంటాయి" అని అన్నారు.

ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో పోటీ.. "మా కుటుంబంలో ఏడుగురు నటులున్నాం. కజిన్స్‌తో ఇంట్లోనే పోటీ ఉంటుంది (నవ్వుతూ..). అలానే, సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉంది. తారక్‌ తాతగారు (నందమూరి తారకరామారావు), మా నాన్న (చిరంజీవి) మధ్య హెల్దీ కాంపిటిషన్‌ ఉండేది. అలాంటిది రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం మా ఇద్దరిని ఎంపిక చేశారు. తారక్‌తో కలిసి మరో సినిమా చేయాలనుంది. ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సంతకం చేశా. 2023లో మూడు చిత్రాలు, 2024లో మూడు చిత్రాలు వస్తాయి" అని రామ్‌ చరణ్‌ తెలిపా

మరిచిపోలేని సంవత్సరం.. "ప్రతి ఏడాదీ బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తా. 2022.. నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరంగా నిలిచింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లినప్పుడు నేను తండ్రిని కాబోతున్నాననే శుభవార్త తెలిసింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' నాకు ఎన్నో జ్ఞాపకాలు అందించింది. నేను ఇలా మీ అందరితో మాట్లాడుతున్నానంటే ఏదో సాధించినట్టుగా ఉంది. ప్రస్తుత క్షణాల్ని బాగా ఆస్వాదిస్తున్నా" అని చెప్పారు.

వాటినే పట్టించుకుంటా.. "ఇండియాలో ఆన్‌స్క్రీన్‌ ఇమేజ్‌, ఆఫ్‌స్క్రీన్‌ ఇమేజ్‌.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. సినిమా విశేషాలు పంచుకునేందుకు కొన్నాళ్ల క్రితం సోషల్‌ మీడియాలో అడుగుపెట్టా. అయితే, దాని వినియోగంలో చురుగ్గా ఉండను. సామాజిక మాధ్యమాల్లో కనిపించే కామెంట్ల కంటే థియేటర్లలో ప్రేక్షకులు చేసే కామెంట్లనే పట్టించుకుంటా" అని చెప్పుకొచ్చారు.

రు.

ఇదీ చూడండి: నాగార్జునతో సినిమా.. అది ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమన్న పూజా హెగ్డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.