బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆయన కెరీర్లోనే అత్యధిక కలెక్షను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం షారుక్ ఈ సినిమా విజయాన్ని సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఈ జోష్‌లోనే తర్వాత మూవీ పనులు మొదలు పెట్టేశారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో 'జవాన్' చిత్రాన్ని పట్టాలెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
బాలీవుడ్ కింగ్‌కాంగ్ షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. 'జవాన్'లో అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవేళ బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరిస్తే బాలీవుడ్‌తో పాటు.. ఇటు తెలుగులోనూ సినిమా సూపర్ హిట్ అవుతుందని అట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. కానీ, ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం అల్లుఅర్జున్ 'పుష్ప2' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే ఈ షూటింగ్లో రష్మిక పాల్గొననుంది.