ETV Bharat / entertainment

3 నిమిషాల్లో 184 'సెల్ఫీ'లు.. స్టార్​ హీరో గిన్నిస్​ రికార్డు.. - అక్షయ్​ కుమార్​ సెల్ఫీ రికార్డ్​

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్ ఓ అరుదైన రికార్డును బ్రేక్​ చేశారు. కేవలం 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్​ వేదికగా పంచుకున్నారు.

Akshay Kumar Breaks Selfie Record
సెల్ఫీ రికార్డును బ్రేక్​ చేసిన అక్షయ్​ కుమార్​
author img

By

Published : Feb 22, 2023, 9:18 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. తన తాజా ప్రాజెక్ట్​ విడుదలకు సిద్ధంగా ఉన్న 'సెల్ఫీ' చిత్రం ప్రమోషన్​లో భాగంగా బుధవారం ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే అక్కడికి వచ్చిన అభిమానులతో​ ఆయన కేవలం 3 నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగారు. తద్వారా ఈ ఫీట్​తో గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ కుమార్​ ఇన్​స్టాలో షేర్​ చేశారు. ఈ వీడియో వైరల్​ అయింది. దీంతో ఆయన్ను సెల్ఫీ కింగ్​ అని నెటిజన్లు పిలుస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో అక్షయ్​ ఆరెంజ్​ కలర్​ షర్ట్​ వేసుకొని కనిపించారు. అలాగే గిన్నిస్​ రికార్డు సర్టిఫికేట్​ను కూడా ఆ వీడియోలో చూపించారు.

అంతకుముందు 2015లో లండన్‌లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ షోలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 3 నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసి రికార్డు సృష్టించారు. అలాగే 2018లో కార్నివాల్ డ్రీమ్ అనే క్రూయిజ్ షిప్‌లో అమెరికాకు చెందిన జేమ్స్ స్మిత్ కేవలం 3 నిమిషాల్లో 168 సెల్ఫీలు తీసి గిన్నిస్ బుక్​లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడీ రికార్డునే అక్షయ్ బ్రేక్ చేశారు.

"కెరీర్​లో సాధించిన ప్రతిదానికి నా శ్రేయోభిలాషులే కారణం. నేను జీవితంలో ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే అది కేవలం నా అభిమానుల చూపించిన ఎనలేని ప్రేమ వల్లే. వారు నాకు ఎంతో అండగా నిలిచారు. ఈ సెల్ఫీల గిన్నిస్​ రికార్డు కూడా వారి సహకారంతోనే సాధించాను. కాబట్టి దీనిని నా ఫ్యాన్స్​కే అంకితం చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మూమెంట్​ నాకు చాలా స్పెషల్​. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను." అంటూ అక్షయ్​ తన పోస్ట్​లో రాసుకొచ్చారు.

అక్షయ్​​ 'సెల్ఫీ' కింగ్.. ఇకపోతే అక్షయ్ కుమార్​ 'సెల్ఫీ' చిత్రంతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2019లో విడుదలైన మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్‌'కి రీమేక్​గా రూపొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.