ETV Bharat / entertainment

తమన్నా, నయన్​తో షాపింగ్​కు ప్రభాస్​!.. బాలయ్య పంచులు మామూలుగా లేవుగా.. - అన్​స్టాపబుల్​ ఎపిసోడ్​

అన్​స్టాపబుల్​-2లో ప్రభాస్​ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. 'చూసింది కూసింతే.. చూడాల్సింది కొండంత' అంటూ ట్వీట్​ చేసింది. మీరూ ఓ సారి ఆ ప్రోమోను చూసేయండి.

aha unstoppable prabhas gopichand episode promo

author img

By

Published : Jan 1, 2023, 2:56 PM IST

Unstoppable Prabhas Episode: అన్‌స్టాపబుల్‌-2లో ప్రభాస్‌ ఎపిసోడ్‌ మొదటి భాగం ఇటీవల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ ఈ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్‌ ప్రోమోలు, అప్‌డేట్స్‌ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అందుకే ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కాగానే రికార్డు స్థాయిలో వ్యూవ్స్‌ నమోదయ్యాయి. ఇక ప్రభాస్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగం ప్రోమోను తాజాగా ఆహా విడుదల చేసింది.

బాలకృష్ణ హుషారైన పంచులతో ప్రభాస్‌ సరదా సమాధానాలతో ఆకట్టుకుంటోంది ఈ ప్రోమో. ఈ రెండోభాగంలో ప్రభాస్‌తో పాటు గోపిచంద్‌ కూడా పాల్గొన్నారు. తమన్నా, నయనతారలలో ఎవరినీ షాపింగ్‌కు తీసుకెళ్తావు అని ప్రభాస్‌ను అడగ్గా.. 'ఇద్దర్నీ తీసుకెళ్తాను..' అని సమాధానం చెప్పారు. దీంతో బాలకృష్ణ 'రెబల్‌స్టార్‌ నారీనారీ నడుమ మురారీ' అంటూ స్టేజ్‌పై నవ్వులు పూయించారు. ఈ ఎపిసోడ్‌ జనవరి 6న డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.

'మీరు చూసింది కూసింత, చూడాల్సింది కొండంత ఉంది. సెకండ్‌ హాఫ్‌లో రచ్చ మాములుగా ఉండదు రెడీగా ఉండండీ' అంటూ ఆహా విడుదల చేసిన ఈ వీడియోపై మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. మొదటిభాగం చివరిలో చూపించిన వీడియోనే మళ్లీ విడుదల చేశారంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే పవన్‌కల్యాణ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఎప్పుడు ఇస్తారంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.