ETV Bharat / entertainment

ప్రముఖ నటి హత్య కేసులో ఊహించని మలుపు.. బతికొచ్చి పోలీసుల ముందు ప్రత్యక్షం.. - బతికొచ్చిన నటి వీణా కపూర్ న్యూస్

హాట్​టాపక్​గా మారిన నటి వీణా కపూర్ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. చనిపోయింది అనుకున్న వీణా కపూర్ బతికి వచ్చారు. తాను హత్యకు గురి కాలేదని బాగానే ఉన్నానంటూ రూమర్స్​కు చెక్​ పెట్టారు. వదంతులు సృష్టించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Actress Veena Kapoor complained Dindoshi police after rumorous of her death
కొడుకుతో పోలీసు స్టేషన్​కు వచ్చిన నటి వీణా కపూర్
author img

By

Published : Dec 15, 2022, 4:28 PM IST

Updated : Dec 15, 2022, 4:34 PM IST

ఇటీవలే చర్చనీయాంశంగా మారిన నటి వీణా కపూర్ హత్యకేసులో ఓ ట్విస్ట్​ చోటు చేసుకుంది. చనిపోయింది అనుకున్న వీణాకపూర్ బతికి వచ్చింది. అంతేకాక తన కొడుకు చేతిలో హత్యకు గురైందన్న పుకార్లకు చెక్​ పెడుతూ పోలీసులను ఆశ్రయించారు. వదంతులు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

"ఇది ఒక మానసిక వేధింపు. నేను ఇప్పుడు ఫిర్యాదు చేయకపోతే, ఇది మళ్లీ ఇలాంటి ఘటనే వేరేవాళ్ల విషయంలో జరిగే అవకాశముంది" అని ఆమె అన్నారు. అయితే నిజానికి ఈ వ్యవహారంలో చనిపోయిన వ్యక్తి , నటి వీణా కపూర్.. పేరు, ప్రాంతం ఒకేలా ఉండటం వల్లే ఈ పొరపాటు జరిగిందని తెలిసింది.

ముంబయి జుహు ప్రాంతంలో పోలీసులకు ఓ మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వృద్ధురాలు నటి వీణా కపూర్ అని, ఆమెను హత్య చేసింది తన కుమారుడు సచిన్​ కపూర్ అని ప్రచారం సృష్టించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు నటి వీణా కపూర్​కు నివాళులు అర్పించటమే కాక.. తన వీణా కపూర్​ అసలు కుమారుడు అభిషేక్​ను విమర్శించారు. ఇక ఈ కేసు వెలుగులోకి రాగానే నటి వీణా కపూర్ దిందోషి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.

"నేను చనిపోయాననే పుకార్ల కారణంగా నా ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. చాలా మంది నాకు నివాళులర్పిస్తున్నారు. నా కొడుకును కూడా చాలా మంది అవమానిస్తున్నారు. ఇదంతా నిజమా?కాదా? అనే ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారు. నాకు ఈ విషయంపై చాలా మెసేజ్​లు, ఫోన్​ కాల్స్ వస్తున్నాయి. అయితే నేను ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టి.. నా కొడుకు నన్ను చంపలేదని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. నాపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ తప్పుడు పుకార్లు కారణంగా, నాకు వర్క్ ఆఫర్స్ కూడా రావటం లేదు. ఈ తప్పుడు వార్తలు నా పనిపై కూడా ప్రభావం చూపుతున్నాయి".

-నటి వీణా కపూర్

వీణా కపూర్​తో పాటు ఆమె కుమారుడు అభిషేక్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. "నేను మా అమ్మను చంపేసినట్లు నాకు చాలా ఫోన్​ కాల్స్ వచ్చాయి. నేను కలలో కూడా అలాంటి పని చేయను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఈ వార్త చదివి నేను అస్వస్థతకు గురయ్యాను. మా అమ్మ చనిపోలేదు. ఆస్తి కోసం నేను ఆమెను చంపలేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని నేను నా చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నాను అని" ఆయన అన్నారు.

Last Updated : Dec 15, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.