ETV Bharat / entertainment

షూటింగ్​లో స్టార్​ హీరోకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు! - విశాల్ లాఠీ సినిమా

Vishal Injured: తమిళ కథానాయకుడు విశాల్​ మరోసారి షూటింగ్​లో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. 'లాఠీ' సినిమా క్లైమాక్స్​ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించింది మూవీటీమ్​.

Actor Vishal injured in Lathi shooting
మరోసారి తీవ్రంగా గాయపడిన హీరో విశాల్​.
author img

By

Published : Jul 4, 2022, 11:58 AM IST

Updated : Jul 4, 2022, 12:05 PM IST

Vishal Injured: యాక్షన్​, స్టంట్​ సీన్స్​ చిత్రీకరించేటప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. నటులు గాయపడుతుంటారు. అయితే డూప్​ లేకుండా ఇలాంటి సన్నివేశాల కోసం రిస్క్​ చేసే హీరోల్లో విశాల్​ ఒకరు. ఎందుకంటే యాక్షన్​ సినిమాలతో ప్రేక్షకుల్లో విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. అయితే పోరాట సన్నివేశాల్లో రియల్​ స్టంట్​లు చేస్తూ ఇప్పటికే పలుసార్లు గాయపడిన ఆయన.. ​తాజాగా మరోసారి తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. గతంతో పోలిస్తే ఈ సారి మరింత ఎక్కువగా దెబ్బలు తగిలాయని సమాచారం.

ప్రస్తతం విశాల్​ నటిస్తున్న చిత్రం 'లాఠీ'. ఈ మూవీ క్లైమాక్స్​ భాగాన్ని రాత్రిపూట తెరకెక్కిస్తుండగా.. ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశాల్​ కాలికి బాగా దెబ్బలు తగిలినట్లు సోషల్​మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపివేసి.. వెంటనే చికిత్స కోసం ఆయన కేరళ వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విశాల్​ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్​ షాట్​లు చేయొద్దని కోరుతున్నారు. అంతకుముందు హైదరాబాద్​లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలోనూ విశాల్​కు గాయాలు అయ్యాయి. అప్పుడూ షూటింగ్​ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు.

Actor Vishal injured in Lathi shooting
షూటింగ్​లో మరోసారి హీరో విశాల్​కు తీవ్ర గాయాలు

ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా 'లాఠీ' తెరకెక్కుతోంది. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సనయన కథా నాయిక. ఇందులో విశాల్​ ఓ శక్తిమంతమైన పోలీస్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ పోరాట ఘట్టాలకు దిలీప్‌ సుబ్బరాయణ్‌ నేతృత్వం వహించారు. మరి విశాల్‌ తన లాఠీతో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికాడో తెలియాలంటే మూవీ రిలీజ్​ వరకు వేచి చూడక తప్పదు. ఇక ఈ చిత్రానికి సంగీతం- సామ్‌ సిఎస్‌, ఛాయాగ్రహణం- బాలసుబ్రమణ్యన్‌ అందిస్తున్నారు.

ఇదీ చూడండి: థ్రిల్లింగ్​ వెబ్​సిరీస్​లో షణ్ముఖ్​.. క్రేజీ టైటిల్​తో నవీన్​చంద్ర​

Last Updated : Jul 4, 2022, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.