ETV Bharat / elections

అనంతపురం అధికార పార్టీకా..? అధికారికా... ? - జేసీ ఫ్యామిలీ

ఒకవైపు .. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత కుమారుడు... మరోవైపు నెమ్మదిగా పనిచేసుకుపోయిన అధికారి..  బలమైన సామాజిక వర్గం నేత ఒకరు.. భారీగా ఓట్లున్న సామాజిక వర్గ నేత మరొకరు. మరి వీరిలో గెలుపెవరిది.. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆ కుటుంబానిదా.. లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అధికారిదా.. ? అనంతపురం పార్లమెంట్ పై ఇప్పుడు అంతా ఇదే చర్చ.

అనంతపురం అధికార పార్టీకా..? అధికారికా... ?
author img

By

Published : Apr 5, 2019, 7:32 AM IST

అనంతపురం అధికార పార్టీకా..? అధికారికా... ?
సీమ రాజకీయంలో సెగలు కక్కే అనంతపురంలో గెలుపు ఎవరిదంటూ.. అంతటా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్రాంతి తీసుకుని కొడుకును ముందుకు తెచ్చిన జేసీకి సంతోషం మిగులుతుందా.. లేక అనంతపురాన్ని వైకాపా ఎగరేసుకెళుతుందా. అని రెండు వైపులా పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

అనంతపురం పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ స్థానాలు ఒకప్పుడు కాంగ్రెస్​కు కంచుకోట. తెదేపా ఆవిర్భావం తర్వాత కాస్త బీటలువారాయి. 1984, 1999, 2014లో ఇక్కడ తెదేపా జెండా ఎగరేసింది. ఈసారి మళ్లీ అనంతలో చక్రం తిప్పాలని భావిస్తోంది. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్​ను బరిలోకి దింపింది. మరోవైపు సీమలో తమ పట్టు పెంచుకునేందుకు వైకాపా వ్యూహాలు చేస్తోంది. సామాజిక సమీకరణాలు అంచనా వేసుకుని...గ్రూప్​వన్​ మాజీ అధికారిని రంగంలోకి పంపింది.

బుజ్జగింపులు..సయోధ్యలు..

అనంతపురం పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ స్థానాలు...జేసీ కుటుంబానికి అడ్డా. కుమారుడికి పట్టం కట్టాలని భావించిన..దివాకర్​ రెడ్డి పక్కకు తప్పుకుని...తెదేపా తరఫున పవన్​రెడ్డికి టికెట్​ ఇప్పించారు. క్షేత్రస్థాయిలోనూ కార్యకర్తలనూ మెప్పించే పనిలో పడ్డారు. అసంతృప్తులను ఇప్పటికీ బుజ్జగిస్తూనే ఉన్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని రాయదుర్గం కాలవ శ్రీనివాసులు బరిలో నిలుచున్నారు. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు, తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కాలవకు మధ్య అభిప్రాయబబేధాలున్నాయి. దీపక్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ఈ వివాదం కాస్త ముదిరింది. ఇక్కడ ఓటు బ్యాంకు తమకు కాకుండపోతుందని భావించినా..దివాకర్ రెడ్డి నేతల మధ్య సయోధ్య కుదిర్చి ప్రచారానికి సై అనిపించారు.

అభివృద్ధి, అభిమానమే...గెలుపు​!

జేసీకి అనుకూలమైన వారికే ఇక్కడ అసెంబ్లీ టికెట్లు ఇప్పించుకున్నారు. కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి బదులుగా జేసీ చెప్పిన ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ దక్కింది. గుంతకల్లులో తెదేపా టికెట్ ఆశించిన మధుసూదన్ గుప్తాకు నిరాశ మిగలడంతో ఆయన జనసేన నుంచి బరిలో దిగారు. దీంతో ఆ ప్రభావం కొంత తెదేపాపై పడే అవకాశం ఉంది. చంద్రబాబు చేసిన అభివృద్ధి, తండ్రిపై ఉన్న అభిమానమే గెలిపిస్తుందని జేసీ పవన్ రెడ్డి చెబుతున్నారు.

నవరత్నాలపై ధీమా

వైకాపా నుంచి అనంతపురం లోక్​సభ బరిలో ఉన్న తలారి రంగయ్య గ్రూప్ వన్ అధికారిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైకాపాలో చేరారు. అనంతపురం పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తామని జగన్ పాదయాత్రలో ప్రకటించారు. ఆ మేరకు రంగయ్యకు అనంతపురం ఎంపీ సీటు దక్కింది.. అనంతపురంలో పరిధిలో ఆయన సామజికవర్గానికి చెందిన వారే ఎక్కువని రంగయ్య ధీమాతో ఉన్నారు. నవరత్నాలపై ప్రచారం చేస్తూ... గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే కలిసొస్తాయని...గెలుపు తథ్యమని ధీమాతో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.