ETV Bharat / crime

Today Crime: పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని.. గిరిజన విద్యార్థి ఆత్మహత్య! - crime news in kurnool

Today Crime: రాష్ట్రంలో పలు చోట్ల వేర్వేరు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. బైపాస్ నిర్మాణ పనుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతిచెందగా, గోరంట్లలో సెబ్ అధికారులు భారీ మద్యాన్ని పట్టుకున్నారు.

Today Crime
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. 6లక్షల నగదు స్వాధీనం
author img

By

Published : Mar 25, 2022, 12:20 PM IST

Updated : Mar 25, 2022, 1:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో గిరిజన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేదని మనస్థాపానికి గురైన అనిల్ కలుపు మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. 6లక్షల నగదు స్వాధీనం: ఏలూరులో ద్విచక్రవాహనంలో దాచిన డబ్బు దొంగిలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నగదు, బైక్, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

గోరంట్లలో భారీ మద్యం పట్టివేత: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో భారీ మద్యంను సెబ్ అధికారులు పట్టుకున్నారు. సెబ్ పోలీసులకు వచ్చిన సమాచారంతో గ్రామంలో తనిఖీ చేయగా 22 బాక్స్​ల మద్యం, 2112 టెట్రా ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. కర్ణాటక రేట్ల ప్రకారం మద్యం విలువ Rs.75 వేలు ఉంటుందని సీఐ తెలిపారు. వారి మీద మీద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తామని సెబ్ సీఐ తెలిపారు.

బైపాస్ నిర్మాణ పనుల వద్ద రోడ్డు ప్రమాదం .. యువకుడు మృతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలో బైపాస్ నిర్మాణ పనుల జరుగుతున్న ప్రదేశంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నకరికల్లులో పొలాల్లో పసికందు లభ్యం: అప్పుడే పుట్టిన పసికందుని నకరికల్లులోని కస్తూర్బా పాఠశాల వెనుకవైపు పొలాల్లో విద్యాలయ సిబ్బంది, అక్కడే పనిచేస్తున్న కూలీలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువును పొలాల్లో నుంచి బయటకు తీయించారు. అనంతరం పీ హెచ్ సీ వైద్యుడు పి.శ్రీనునాయక్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.

కొండపై తయారు చేస్తున్న నాటుసారా స్థావరంపై పోలీసుల దాడులు: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం గుడదహళ్లి తండా గ్రామ శివారులో ఉన్న కొండపై నాటుసారా తయారు చేస్తున్న స్థావరంపై స్థానిక సీఐ శ్రీరామ్, సెబ్ సి.ఐ, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. తయారీదారులు ఉపయోగించిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 240 లీటర్ల బెల్లపు మిశ్రమాన్ని, 15 లీటర్ల నాటుసారాను పోలీసులు కొండపై పారబోశారు. పోలీసుల రాకను గమనించిన తయారీదారులు ముందుగానే అక్కడినుంచి పరారయ్యారు.

ముగ్గురు తెదేపా నాయకులను అదుపులోకి తీసుకున్న మాచవరం ఎస్సై: గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం మాచవరం మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అంబులమ్మ కుమారుడు దారం లక్ష్మీరెడ్డిపై ఈ నెల22న దాడి జరిగింది. ఈ దాడికి ప్రయతించిన మొర్జంపాడు గ్రామానికి చెందిన ముగ్గురు తెదేపా నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గురువారం వారిపై 307 కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

"పుష్కలంగా సాగునీరందిస్తాం అన్నారు.. పొలాలు బీటలువారుతున్నా పట్టించుకోట్లేదు"

Last Updated : Mar 25, 2022, 1:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.