engineering student arrested in Ap: అతడు ఇంజనీరింగ్ విద్యార్థి, అతని తల్లిదండ్రులు తమ కొడుకు ఉన్నత చదువులు చదివి తమను ఉద్దరిస్తాడని ఆశ పడ్డారు. అందుకోసం తమ తాహతకు మించి చదువులు చదివిస్తున్నారు. అయితే, ఆ విద్యార్థి మాత్రం చదువును పక్కనపెట్టి అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ... వ్యసనాలకు బానిసగామారాడు. డబ్బుల కోసం చోరీలకు పాల్పడటం మెుదలు పెట్టి పోలీసులకు పట్టుబడిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది.
ఆన్లైన్ క్రీడలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు బానిసై సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురాశకు లోనై... ఏటీఎం కార్డులను తారుమారు చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 16 నకిలీ ఏటీఎం కార్డులు డెబిట్ కార్డులు ఒక చరవాణి, నాలుగు వేల రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి అరెస్ట్ అయిన విద్యార్థి మీడియా ఎదుట హాజరు పరిచారు. చిత్తూరు జిల్లా నగిరి మండలానికి చెందిన వెంకటేష్ విజయవాడలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్స్ చదువుతున్నాడు. మెుదట చదువుల్లో రానించినా ఆపై ఆన్లైన్ క్రీడలకు అలవాటు పడ్డినట్లు పోలీసులు తెలిపారు. ఆటల్లో లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ అప్పులు తీర్చడంతో పాటుగా... సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అందుకోసం ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను వృద్ధులను ఎంచుకొని డబ్బులు డ్రా చేయిస్తానని చెప్పి నమ్మించి అనంతరం వారి ఏటీఎం కార్డు నుంచి వారి ఖాతాలో డబ్బులు డ్రా చేసుకునేవాడని పేర్కొన్నారు. ఇలాగే ఇప్పటివరకూ.. కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితున్ని ఇవాళ కడప శివారులో రింగురోడ్డు వద్ద అరెస్టు చేశారు. అతని నుంచి 16 ఏటీఎం, కార్డులు డెబిట్, క్రెడిట్ కార్డులను, ఒక చరవాణి, 4000 రూపాయల నగదును స్వాధీన పరుచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎంలు ఇతరులకు ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని పోలీసులు పేర్కొన్నారు.
'ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను వృద్ధులను ఎంచుకొని డబ్బులు డ్రా చేస్తున్నాడు. ఇతనిపై ఆరు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. అందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థి చోరిలోకు పాల్పడుతున్నడని తెలింది.'- వెంకట శివారెడ్డి, డీఎస్పీ
ఇవీ చదవండి: