ETV Bharat / crime

పోలీస్​స్టేషన్​ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..! - crime news in ap

WOMAN SUICIDE ATTEMPT : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లుగా ఓ వ్యక్తి పని చేసిన పెట్రోలు బంక్​లోనే మోసానికి తెరదీశాడు. పెట్రోల్​, డీజిల్​ అమ్మగా వచ్చిన డబ్బులను తన సొంత ఖర్చులకు వాడుకుని బంక్​కి పంగనామం పెట్టాడు. అలా సుమారు కోటి రూపాయలకు ఎసరు పెట్టాడు. అయితే తాజాగా ఆ వ్యక్తి భార్య పోలీస్​స్టేషన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వైఎస్సార్​ జిల్లాలో జరిగింది.

WOMAN SUICIDE ATTEMPT
WOMAN SUICIDE ATTEMPT
author img

By

Published : Feb 13, 2023, 5:21 PM IST

Updated : Feb 13, 2023, 5:29 PM IST

WOMAN SUICIDE ATTEMPT : ఓ పెట్రోల్​ బంక్​లో ఓ వ్యక్తి 8 సంవత్సరాలుగా మేనేజర్​గా పని చేస్తున్నాడు. తిన్న ఇంటికే కన్నం వేసినట్లుగా బంక్​లో పని చేస్తూనే పెట్రోల్, డీజిల్​ అమ్మగా వచ్చిన డబ్బులను చెడు వ్యసనాలకు అలవాటు పడి వాడుకున్నాడు. అలా వందలు కాదు వేలు కాదు.. సుమారు కోటి రూపాయలకు సున్నం పెట్టాడు. నగదు లావాదేవీలలో తప్పు జరుగుతున్నట్లు గుర్తించిన బంక్​ ఓనర్​.. కొన్ని రోజుల క్రితం సదరు మేనేజర్​పై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. అయితే బంక్​ యజమాని అధిక మొత్తంలో డబ్బులు కట్టాలని వేధిస్తున్నట్లు మేనేజర్​ భార్య పట్టణంలోని పోలీస్​స్టేషన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వైఎస్సార్​ జిల్లాలోని జమ్మలమడుగులో జరిగింది.

పోలీస్​స్టేషన్​ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "పట్టణంలోని రామకృష్ణ ఫిల్లింగ్​ సెంటర్​లో​ జానపాటి లక్ష్మీ నరసింహులు గత 8 సంవత్సరాలుగా మేనేజర్​గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి బంక్​లోనే మోసానికి పాల్పడ్డాడు. బంక్​లో వచ్చే నగదను తన స్వలాభాల కోసం ఖర్చు చేసుకున్నాడు. దీనిని గుర్తించిన బంక్​ యజమాని గత సంవత్సరం అక్టోబర్​ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించగా.. దాదాపు కోటి రూపాయలు వాడుకున్నట్లు తెలిసింది. అతని బ్యాంకు వివరాలను పరిశీలించగా.. అతని భార్య అకౌంట్​లో కూడా లక్షలు డిపాజిట్​ అయినట్లు గుర్తించాము. ఈ కేసుపై పూర్తి విచారణ చేసి నిజనిజాలు బయటపెడతాం" అని జమ్మలమడుగు సీఐ సదాశివయ్య తెలిపారు. అయితే నరసింహులు భార్య ఆత్మహత్యాయత్నం కేవలం కేసును పక్కదారి పట్టించడానికే అని పోలీసులు ఆరోపిస్తున్నారు.

కుటుంబసభ్యులు మాత్రం బంక్​ యజమాని డబ్బులు కట్టమని బెదిరిస్తున్నారని.. అందుకే నాగలక్ష్మీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బంక్​ యజమాని ఒత్తిడి చేయడంతో గూడెం చెరువు గ్రామంలో ఉన్న ఇంటిని తనఖా పెట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చాం. తీసుకున్న వాటి కన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంక్​ యజమాని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 13, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.