ETV Bharat / crime

తూర్పుగోదావరి జిల్లాలో బైక్‌ను ఢీకొన్న వ్యాన్‌... నలుగురు మృతి

author img

By

Published : Feb 20, 2022, 9:55 AM IST

Updated : Feb 20, 2022, 1:45 PM IST

Road Accident at East Godavari
Road Accident at East Godavari

09:50 February 20

ఎదురులంక - యానాం గౌతమి వంతెనపై ప్రమాదం, నలుగురు మృతి

Accident at East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురులంక-యానాం గౌతమి వంతెనపై... ఐదుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది. లక్కీ అనే చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులు ఐ.పోలవరం మండలం జి.వేమవరం గ్రామానికి చెందిన వైదాడి కుమార్ (35) వైదాడి పద్మ(30) హర్ష(10) హర్షితగా పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న మినీ వ్యాన్... ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని పోలీసులు తెలిపారు. వ్యాన్‌ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !

Last Updated : Feb 20, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.