ETV Bharat / crime

'ఆ అమ్మాయి నా ప్రాణం.. పెళ్లి చేసుకుంటే చంపేస్తా..' - begumbazar cheating case news

బంధువుల అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అది ఎంతలా అంటే.. తన ప్రాణం కంటే అమ్మాయే ఎక్కువ అనే స్థాయికి చేరింది. ఇంతలో ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏం చేయాలో తెలియని ఆ 'ఒంటరి' ప్రేమికుడు.. తాను అమ్మాయిని ప్రేమిస్తున్నానన్న విషయం తన ప్రియురాలి కంటే ముందు తనను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయికి చెప్పాడు. తర్వాత ఏమైందంటే..?

telangana
వన్ సైడ్ లవ్
author img

By

Published : Mar 19, 2021, 8:41 PM IST

ఇన్​స్టా బెదిరింపులతో ఆగిన పెళ్లి

'నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది.. ఆమెను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.. కాదని నువ్వు పెళ్లికి సిద్ధమైతే చంపేస్తా' అంటూ ఇన్‌స్టాలో బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు.

నిజామాబాద్​కు చెందిన వివేక్ అనే యువకుడి కుటుంబం బేగంబజార్​లో స్థిరపడింది. వివేక్ మల్కాజిగిరి సఫిల్​గూడలో ఉండే తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. మరో రెండు నెలల్లో పెళ్లి ఉంది.

విషయం వివేక్​కు తెలిసింది. పెళ్లిని ఆపేయాలని భావించిన వివేక్​.. ఇన్​స్టాలో 'నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి నాది.. కాదని నువ్వు పెళ్లికి సిద్ధమైతే చంపేస్తా' అంటూ పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి మెస్సేజ్​ చేశాడు. సందేశం చూసి అబ్బాయితో పాటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇలా వరుసగా సందేశాలు వస్తుండటంతో అమ్మాయి తల్లిదండ్రులను నిలదీశారు. పెళ్లిని రద్దు చేసుకున్నారు.

సీన్ కట్​చేస్తే.. అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు వివేక్​గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుంటోందని తట్టుకోలేక.. ఇలా పోస్టులు పెట్టానని అంగీకరించినట్లు తెలిపారు.

ఇక్కడ అసలు ట్విస్ట్​ ఏంటంటే.. అతడు ప్రేమించిన విషయం ఇంకా అమ్మాయికి చెప్పలేదట. ఇద్దరూ ప్రేమించుకున్నారా అని పోలీసులు అడిగితే 'నాది వన్ సైడ్ లవ్.. త్వరలోనే అమ్మాయికి చెబుదామనుకున్నా.. ఇంతలో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారని చావు కబురు చల్లగా చెప్పాడు' అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.