విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడికి చెందిన ఓ రైతు ఆవు జున్నును తన బంధువులైన మాడుగుల మండలం డి.సురవరం పంపించారు. ఏమైందో.. ఏమో కానీ ఆ జున్ను తిన్న వారు తీవ్ర అస్వస్థతకు గురై..వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. వారందరిని మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు.
వైద్యాధికారి సూర్య ప్రకాశ్, వైద్య సిబ్బంది తక్షణమే బాధితులకు వైద్య పరీక్షలు జరిపారు. చికిత్స అనంతరం బాధితులు ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు చిన్న పిల్లలున్నారని చెప్పారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: