ETV Bharat / crime

Mystery Revealed: నాలుగేళ్ల తర్వాత బయటపడ్డాడు.. మద్యం మత్తులో నిజం చెప్పాడు

Mystery revealed: క్రికెట్‌ ఆడే సమయంలో ఓ విద్యార్థి, ముగ్గురు భవన నిర్మాణ కూలీలకూ మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం బాగానే సాగింది. ఓరోజు వారి మధ్య జరిగిన గొడవలో ఆ విద్యార్థి హత్యకు గురయ్యారు. మృతదేహం కనిపించలేదు. అప్పటినుంచి ఆ కుర్రాడి ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఇటీవల హంతకుల్లో ఒకరు మద్యం మత్తులో ఈ విషయం చెప్పడంతో నిజం బయటపడింది.

death mystery of student revealed in west godavari
నాలుగేళ్లుగా మిస్టరీ.. తాగిన మైకంలో నిజం చెప్పేశాడు
author img

By

Published : Apr 6, 2022, 9:34 AM IST

Mystery revealed: ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పి.శ్రీహర్ష(17) 2018లో వేలివెన్నులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. అదే ఏడాది దీపావళికి దారవరంలోని తాతయ్య శ్యామ్‌సన్‌ ఇంటికి వచ్చాడు. అంతకుముందు నుంచే క్రికెట్‌లో స్నేహితులైన నిర్మాణ కూలీలు షేక్‌ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి నిడదవోలు జూనియర్‌ కళాశాలకు ఆడుకొనేందుకు వెళ్లారు. వీరి మధ్య తగాదా నెలకొనడంతో పథకం ప్రకారం శ్రీహర్షను ఆ ముగ్గురూ.. మెడకు తాడు బిగించి హతమర్చారు. శవం కనిపించకుండా కళాశాలలోని వినియోగంలో లేని సెప్టిక్‌ ట్యాంక్‌లో దాచిపెట్టారు. ఏడాది తరువాత 2019లో ఆ ముగ్గురూ కళేబరాన్ని బయటకు తీసి, నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. 2018లోనే శ్రీహర్ష అదృశ్యంపై తండ్రి రత్నకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

అప్పటినుంచి అదో మిస్టరీలా మిగిలిపోయింది. కాగా ఇటీవల రషీద్‌ తాగిన మైకంలో తనతో జాగ్రత్తగా ఉండాలని.. తానో హత్య చేసినట్లు మిత్రులను హెచ్చరించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడింది. రషీద్‌ను అరెస్టు చేశారు. ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. డీఎస్పీ శ్రీనాథ్‌ నిడదవోలు కళాశాలలోని సెప్టిక్‌ ట్యాంక్‌లో మరికొన్ని ఎముకలను గుర్తించారు. ఎస్సై రమేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్‌ నుంచి దూకి యువతి ఆత్మహత్య !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.