చంద్రబాబు రాక కోసం తెదేపా.. అడ్డుకునేందుకు వైకాపా - tension in visakha due to chandrababu tour
విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు, అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. మరోవైపు.. ఇప్పటివరకూ పోలీసులు ఈ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తును మోహరించారు. ఇరు పార్టీల నేతలను అదుపు చేస్తున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్.. విశాఖ నుంచి అందిస్తారు.