విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఆరో రోజైన నేడు మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిచ్చారు. చదువుల తల్లి సరస్వతీ దేవి నామస్మరణతో శ్రీ శారదాపీఠం మార్మోగింది. శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో... వందలాది మంది పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున సరస్వతీ మాత పూజలో పాల్గొన్నారు.
వీణ, పుస్తకధారిణిగా మహా సరస్వతి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి హారతులిచ్చి పూజలు చేశారు.
ఇదీ చదవండి :విజయవాడ కనకదుర్గమ్మకు.. కనక మహాలక్ష్మీ అమ్మవారి సారె