ETV Bharat / city

Baby చనిపోయిందని ఖననానికి తీసుకెళ్లారు, కదులుతుందని తిరిగి ఆస్పత్రికి ఆ తర్వాత - ఖననం కోసం తీసుకెళ్లి కదిలిన శిశువు

Baby పొత్తిళ్లలో ఉన్న పసిపాప ప్రాణంపోతే ఆ గర్భశోకం తట్టుకోలేం. అదే శిశువును ఖననం చేయబోతుండగా కదిలితే తల్లిదండ్రులకు ప్రాణం లేచివచ్చినంత సంతోషం. మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాక చికిత్స పొందుతూ చనిపోతే అంతులేని విషాదం. చావు, పుట్టుకల మధ్య ఉండే ఈ పుట్టెదు దుఃఖాన్ని అనుభవించారు విశాఖకు చెందిన దంపతులు. అసలేం జరిగిందంటే.

baby
శిశువు
author img

By

Published : Aug 22, 2022, 5:27 PM IST

Baby బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పాప కదిలిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈనెల 19న జూహీకుమారి అనే మహిళ... ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 20వ తేదీ ఉదయం రక్త పరీక్షలు చేశారు. కొన్ని గంటల అనంతరం శిశువు మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో తండ్రి తారకేశ్వరసింగ్ విషాదంతో బిడ్డను ఆదివారం ప్రైవేటు అంబులెన్సులో కాన్వెంట్ కూడలిలోని హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశాన వాటికలో పనిచేస్తున్న రాజు వస్త్రాలు తొలగిస్తుండగా పాప కదలడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి, అతని బంధువులు ఉలిక్కిపడ్డారు. దీనిపై శ్మశానవాటిక సిబ్బంది ప్రశ్నించగా... ఆస్పత్రి వర్గాలు పాప మృతి చెందిందని చెప్పడంతో ఖననానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. తర్వాత హుటాహుటిన తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శిశువుకు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందింది. అనంతరం మళ్లీ శ్మశాన వాటికకు తీసుకొచ్చి ఖననం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.