విశాఖలో జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. సీతమ్మధార ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, వైద్యులు హాజరయ్యారు. నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనందున జర్నలిస్టులు బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇంటర్వ్యూలు తీసుకునే మైకులు మీద ఉండే స్పాంజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు.
ఇవీ చదవండి: