కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని శనివారం నుంచి ఈనెల 31 వరకు నిలిపివేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. మూల్యాంకనం ఎప్పటి నుంచి చేపట్టాలనే విషయాన్ని ఈనెల 31 తర్వాత పరిశీలించి వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సివిల్' ఇంటర్య్వూలు వాయిదా.. కరోనానే కారణం!