ETV Bharat / city

GVMC commissioner: ఆసక్తి రేపుతున్న జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్

వైకాపా నాయకులు జీవీఎంసీ కమిషనర్ సృజన తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు... ఎంపీ విజయసాయి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సృజన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అదేంటంటే...

GVMC Commissiner
GVMC Commissiner
author img

By

Published : Sep 5, 2021, 10:46 AM IST

మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ జి. సృజన పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అదే విషయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు.. ఎంపీ విజయసాయి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషనర్ శనివారం రాత్రి చేసిన ట్వీట్ ఆసక్తి కరంగా మారింది.

"ధీరులు ధర్మంగా ఉండాలి. వీరులు పనిచేయాలి. తలెత్తుకుని ఉండాలి. భయపడకూడదు. ఏది కచ్చితమైన పనో దాని కోసం ధైర్యంగా నిలిచేలా, ధర్మాన్ని కాపాడేలా శక్తినిచ్చినందుకు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు.

ముస్సోరిలో తాను ఐఏఎస్​గా శిక్షణ పొందిన లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, ఆ అకాడమీ పూర్వ విద్యార్థుల సంఘాన్ని, ఐఏఎస్​ సంఘాన్ని ఆమె ట్యాగ్ చేశారు.

ఇదీ చదవండి: macaw illegal transport: గ్రీన్ వింగ్ మకావ్ జాతి పక్షుల పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.