ETV Bharat / city

'తెదేపా - వైకాపా.. వారి జెండాలు వేరైనా ఎజెండాలు ఒక్కటే' - ఏడాది పాలనపై బీజేపీ వర్చువల్ ర్యాలీలు

ఏడాది పాలనలో కేంద్రం తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా వర్చువల్​ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు భాజపా తెలిపింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోనూ వర్చువల్​ ర్యాలీలు చేస్తున్నట్లు భాజపా నేతలు ప్రకటించారు.

భాజపా నేతలు
భాజపా నేతలు
author img

By

Published : Jun 8, 2020, 3:36 PM IST

మోదీ ఏడాది పాలనపై దేశవ్యాప్తంగా వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఏడాదిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల్లో భాజపా నేత రామ్ మాధవ్ సామాజిక మాధ్యమాల ద్వారా పాల్గొనేలా మొదటి వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో రెండో ర్యాలీ.. రాయలసీమలోని 4 జిల్లాల్లో మూడో ర్యాలీ చేపడతామని తెలిపారు.

కరోనా కారణంగా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని తెలిపారు. జూన్​ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వర్చువల్ యోగా నిర్వహిస్తామన్నారు. ఇంట్లో నుంచే యోగా వేడుకల్లో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామని కంభంపాటి హరిబాబు చెప్పారు. జూన్ 23వ తేదీన డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి వర్ధంతిని.. బలిదాన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 25న అత్యవసర పరిస్థితి వ్యతిరేక రోజుగా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 30 వరకు ప్రధాని మోదీ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా నాయకుల ప్రసంగాలుంటాయని తెలిపారు.

భాజపా ఏడాది పాలనా విజయాలను తెలియజేస్తూనే... రాష్ట్రంలో వైకాపా పాలనలో లోటుపాట్లను ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ చెప్పారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని మాధవ్ అన్నారు. ఆన్​లైన్​లో ఇసుక మాఫియా విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో తెదేపా.. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వాల జెండాలు మారాయి కానీ.. ఎజెండాలు మారలేదన్నారు.. వ్యాపార దృక్పథం తప్ప.. ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.