అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం రాజ్యాంగ, చట్ట విరుద్ధమని వెల్లడించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీపై హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ హైకోర్టు ఉద్యోగులు, జడ్జిలు, న్యాయవాదులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. ప్రకాశం బ్యారేజీపై ఇతర వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని పేర్కొన్నారు. కాలినడకన వెళ్లేవారికి అనుమతి లేదని వివరించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక, కుమ్మరిపాలెం, వన్‌టౌన్, తాడేపల్లి, సీతానగరం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మళ్లిస్తామని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: