తెలుగుదేశం నేత కూన రవికుమార్‌ను శ్రీకాకుళంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం, పోలీసులు అణగదొక్కలేరని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌ను గృహనిర్బంధం చేసేందుకు... ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఆయన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డిని.. ఎమ్మిగనూరులోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి వెళ్తుండగా ఆయనను అడ్డుకున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని చిరంజీవులు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: