విజయవాడ నగరంలో కర్ఫ్యూ నిబంధనలను విరుద్ధంగా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలా రోడ్లపైకి వస్తున్న వారిపై జరిమానాలు, కేసులు నమోదు చేస్తున్నారు.
మెడికల్, అత్యవసర సర్వీసు పత్రాలు కలిగిన సిబ్బంది నగరంలో అనేకసార్లు వివిధ ప్రాంతాల్లో వాహనాలపై తిరగడాన్ని నిరోధించేందుకు.. వారి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లమీద తిరిగితే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
బారాబంకీ మసీదు కూల్చివేతపై విచారణ కమిటీ
అవినీతి, దోపిడీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు: జీవీ ఆంజనేయులు