NTR varsity employees protest: విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. విధులు బహిష్కరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా విధులు బహిష్కరించినట్లు స్పష్టం చేశారు.
యూనివర్శిటీ నిధుల మళ్లింపును నిరసిస్తూ.. విధులు బహిష్కరిస్తామని నిన్ననే ఉద్యోగులు ప్రకటించారు. ఏం చేసైనా సరే నిధులు కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు వర్శిటీ పరిణామాలపై నివేదిస్తామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
సీఎంవో నుంచి ఒత్తిడితో యూనివర్శిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అప్పులు పుట్టక.. సంస్థల నిధులు మళ్లిస్తుందని విమర్శించారు. తాజా నిర్ణయంతో ఉద్యోగులను, వర్శిటీని రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. అన్ని సంఘాల నేతలు కలిసి జేఏసిగా ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం మళ్లించుకున్న రూ.400 కోట్లు వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధుల మళ్లింపు వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: