ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లను.. దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు.. 28 ప్రత్యేక రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలను దక్షిణమధ్య రైల్వే వెబ్ సైట్లో పొందుపరచినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: సుప్రీం కోర్టు
ఏపీ, తెలంగాణలో పాక్షిక కర్ఫ్యూ అమలు దృష్ట్యా.. రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్ ధాటికి భయపడి చాలా మంది అత్యవసరమైతేనే తప్ప బయటకు రావడం లేదు. ఫలితంగా.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లు ఖాళీగా రాకపోకలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. రిజర్వేషన్ బోగీలన్నీ బోసిపోయాయి. సీట్ల భర్తీ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: