ETV Bharat / city

Ugadi Wishes: 'ఆనందం- ఆశల పండుగ ఉగాది'

author img

By

Published : Apr 2, 2022, 4:27 AM IST

Ugadi Wishes: 'ఆనందం- ఆశల పండుగ ఈ ఉగాది' అని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్​తోపాటు సీఎం జగన్​, చంద్రబాబు, లోకేశ్​, పవన్​ కల్యాణ్​.. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Ugadi Wishes
Ugadi Wishes

Governor Ugadi Wishes: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకుసాగాలని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు‘ఉగాది’ శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభకృత్​ నామ ఉగాది’.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని అభిలషించారు. షడ్రుసోపేతమైన 'ఉగాది పచ్చడి' ఏడాది పొడవునా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని అన్నారు. ఆనందం- ఆశల పండుగ ఉగాది అని ఆయన అన్నారు.

CM jagan Wishes: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ శుభకృత్ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం ఆక్షాంచించారు. ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని సీఎం కోరారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని కోరుకున్నారు. రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని సీఎం అభిలషించారు.

TDP Leaders Wishes: తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారు తొలి పండుగగా భావించే ఉగాది.. ప్రజలకు సకల శుభాలు కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని కష్టాలుతొలగి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరారు. పాలకుల పాపాలతో, పెరిగిన ధరలు, పంట నష్టాలతో తీవ్ర కష్టాలు పడిన రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలన్నారు. చేదు మాత్రమే మిగిలిన సామాన్యుల జీవితాలకు తీపి తోడవ్వాలన్నారు.

కొత్త సంవ‌త్సరంలో త‌ల‌పెట్టిన కార్యాల‌న్నీ నిర్విఘ్నంగా కొన‌సాగాలని, అచ్చతెలుగు పండ‌ుగ ఉగాదిని ఇంటిల్లిపాదీ ఆనందంతో జ‌రుపుకోవాలని లోకేశ్ కోరారు. ఉగాది బహుమతిగా జగన్ రెడ్డి ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుతో పండుగ ప్రశాంతంగా జరుపుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన వాపోయారు.

Pawan Ugadi Wishes: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలపై ధరాఘాతాలు, పన్నుపోట్లు లేని పాలన అందించేలా పాలకుల మనుసు మార్చాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్​ పేర్కొన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలని ఆకాంక్షించారు. రైతులకు పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపారాలు సంవృద్ధిగా జరగాలని, కార్మికులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలు సుఖ సంపదలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Mouna Poratam: మళ్లీ 'మౌనపోరాటం'.. ఎక్కడంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.