ETV Bharat / city

హైకోర్టులో వైకాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

గ్రామపంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగుల విషయంలో కళ్లకు గంతలు కట్టాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. మూడు రంగులకు అదనంగా మట్టిరంగు వేయాలంటూ ఇచ్చిన జీవోను ఈనెల 19 వరకూ రద్దుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ చర్యను ఎందుకు కోర్టుకు ధిక్కరణగా పరిగణించకూడదో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది.

The High Court dismissed the GO issued by the AP government on the issue of YCP colors on panchayat offices.
హైకోర్టులో వైకాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
author img

By

Published : May 5, 2020, 3:12 PM IST

Updated : May 6, 2020, 7:33 AM IST

ప్రభుత్వ భవనాలకు ఇప్పటికే వేసిన వైకాపా రంగులకు అదనంగా ఎర్రమట్టి రంగు వేయాలని ప్రభుత్వం ఏప్రిల్ 23న జీవో నంబర్‌ 623 జారీ చేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా అంగలకుదురు రైతు సూర్యదేవర వెంకటరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రాజకీయ పార్టీల జెండాల్ని పోలిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడానికి వీల్లేదన్న తీర్పునుప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు.

కొత్తరంగులు వేస్తున్నామనే సాకుతో మళ్లీ వైకాపా జెండాను పోలిన రంగుల్నే వేసేలా జీవో తెచ్చిందని విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. జీవోనంబర్‌ 623లో ప్రభుత్వం నిర్దేశించిన రంగులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. వైకాపా జెండాను పోలిన ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులను తొలగించకుండా పంచాయతీ భవనాలకు అదనంగా ఎర్రమట్టి రంగును వేయాలని ఉత్తర్వల్లో పేర్కొందని వివరించారు. పార్టీ రంగులేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 623జీవోను రద్దు చేయాలని కోరారు.

పిటిషనర్‌ వాదనలను ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ వాదనలు తోసిపుచ్చారు. ప్రస్తుతం నిర్ణయించిన రంగులకు రాజకీయ పార్టీల రంగులతో సంబంధం లేదని, వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం ప్రభుత్వం చెప్పదలచుకున్న వివరాల్ని ప్రమాణ పత్రం రూపంలో దాఖలు చేయాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌కు సూచించింది.

విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ అప్పటి వరకూ జీవో 623ని సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దంటూ తాము తీర్పు ఇచ్చినప్పటికీ రాజకీయ పార్టీ రంగుల్ని పోలిన రంగులు వేసేందుకు నిర్ణయించడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నిలదీసింది. జీవో నెంబర్ 623ను ఎలా సమర్థించుకుంటారో ప్రమాణ పత్రంలో పేర్కొనాలనిఆదేశించింది.

ఇవీ చదవండి...నిమ్మగడ్డ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు

Last Updated : May 6, 2020, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.